Breaking News

Daily Archives: April 30, 2019

మేడే గోడప్రతుల ఆవిష్కరణ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ మరియు గ్రామపంచాయతీవర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం మేడే పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కులన్నీ పోరాటం ద్వారా దక్కుతాయని చికాగో కార్మికులు నిరూపించారని, కార్మిక అమరవీరుల స్ఫూర్తితో పోరాడి ఎన్నో చట్టాలను సాధించుకున్నామని దాసు అన్నారు. నరేంద్ర మోడీ సర్కార్‌, కేసీఆర్‌ సర్కార్‌ దోపిడీ వర్గాల కవల పిల్లలని పేర్కొన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ, ఉపాధి భద్రత లేకుండా చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ...

Read More »

జడ్పిటిసి, ఎంపిటిసి బి ఫాంల పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజుకు జడ్పిటిసి, ఎంపిటిసి బిఫారాలను జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు అందజేశారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని జిల్లా పరిషత్‌ను దక్కించుకోవాలని అన్నారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఇందుకోసం సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు సంపాదన, శ్రమ పట్ల అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుకునే సమయంలోనే విద్యార్థులకు సంపాదన, శ్రమ పట్ల అవగాహన కల్పిస్తే విద్యార్తులు మరింత పరిపక్వత సాధిస్తారని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద వ్యవసాయ క్షేత్రంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌, పాలిటెక్నిక్‌ కళాశాల సంయుక్త సహకారంతో జిల్లా ఉద్యానవన శాఖ నిర్వహిస్తున్న కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకాన్ని ఆయన సందర్శించారు. ఐదెకరాల స్థలంలో డ్రిప్‌, మల్చింగ్‌ పద్దతిలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల భాగస్వామ్యంతో నూతన పరిజ్ఞానంతో జరుగుతున్న హైబ్రిడ్‌ ...

Read More »

నామినేషన్‌ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడో విడత జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నాగిరెడ్డిపేట, లింగంపేట్‌ ఎంపిడివో కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణవాయువైన ఓటు హక్కును ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. మొత్తం 22 జడ్పిటిసి, 236 ఎంపిటిసి ఎన్నికలకు జరిగే మూడో విడత ఎన్నికల్లో 6 లక్షల 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు వివరించారు. ...

Read More »

ఆటో బోల్తా : ఒకరు మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి రెడ్డిపేట గ్రామానికి మంగళవారం ప్యాసింజర్‌ ఆటో ప్రయానీకులతో వెళుతుండగా రామారెడ్డి మండలం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల మధ్యగల వంతెనపై నుంచి ఆటో అదుపుతప్పి కిందపడడంతో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన కళ్యాణ్‌ కామరెడ్డి నుంచి రెడ్డిపేట వెళుతున్న ఆటోలో పదిమంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. వంతెనపై నుంచి ఆటో అదుపుతప్పి కిందపడడంతో రెడ్డిపేటకు చెందిన కళ్యాణ్‌ (28) సంఘటన స్థలంలోనే ...

Read More »

శిక్షణకు హాజరుకానివారు కారణాలు తెలపాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీటీసీ, జెడ్‌పిటిసి మొదటి దశ ఎన్నికల కోసం నియమింపబడ్డ పివోలు, ఏపీఓలు శిక్షణ తరగతులకు హాజరుకాని వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకొనుటకు సిఫార్సు చేయడం జరుగుతుందని జిల్లా పరిషత్‌ సీఈవో వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా హాజరుకాని ఏపీఓలు పివోలు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఎందుకు హాజరు కాలేకపోయారో సరైన కారణాలు తెలుపుతూ సంబందిత పత్రాలతో సంజాయిషి తెలుపని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి హెడ్‌ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్‌కు సిఫార్సు చేయడం ...

Read More »

ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా చూడాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం సేకరణలో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యాన్ని నిర్ణీత సమయంలో తూకం వేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల నుండి తీసుకున్న ధాన్యాన్ని వెంట వెంట రైస్‌ మిల్లులకు పంపించడానికి సరిపోయినంతగా లారీలను, కూలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతుల నుండి తీసుకున్న ధాన్యానికి ...

Read More »

జవాబు పత్రాలు పునఃపరిశీలనకు అన్ని ఏర్పాట్లు

విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ జవాబు పత్రాల పునః మూల్యాంకనకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాదు నుండి ఆయన కలెక్టర్లు, ఇంటర్మీడియట్‌ అధికారులతో మాట్లాడారు. పునః మూల్యాంకనకు, రీకౌంటింగ్‌కు జిల్లాలో అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని తెలిపారు. అందుకు అవసరమగు సెక్రిగేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని బుక్‌ స్కానర్స్‌, బార్కోడ్‌ స్కానర్స్‌, ...

Read More »

విద్యార్థి నాయకులను అరెస్ట్‌ చేయడం దారుణం

రెంజల్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు నిరసనగా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి నాయకులను అక్రమ అరెస్ట్‌లు చేయడం దారుణమని ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్‌ నవీన్‌ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ రెంజల్‌ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇంటర్మీడియట్‌ బోర్డు విద్యార్థులకు శాపంగా మారిందని, 22 మంది విద్యార్థులు చనిపోతే ఇప్పటివరకు ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ...

Read More »

తెరాస అభ్యర్థులను గెలిపించండి

మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌ బీర్కూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 10 న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్‌ ఓటరులను అభ్యర్థించారు. మంగళవారం మండల కేంద్రం బీర్కూర్లో జడ్పీటీసీ అభ్యర్థి స్వరూప, బీర్కూర్‌ 2 ఎంపీటీసీ అభ్యర్థి సందీప్‌ పటేల్‌, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా హరిజన వాడ లోని కురుతెమ్మ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రచారం ...

Read More »

బుధవారం మేడే కవితా గానం…

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మేడే కవితా గానాలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌ తెలిపారు. కామారెడ్డి కర్షక్‌ బి.ఇడి కళాశాలలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, కవులు, సాహితీ అభిమానులు, రచయితలు పాల్గొనాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై కవితలు వినిపించాలని, కవితలన్నింటిని సంచిక రూపంలో తీసుకువస్తామన్నారు.

Read More »