Breaking News

ఆటో బోల్తా : ఒకరు మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి రెడ్డిపేట గ్రామానికి మంగళవారం ప్యాసింజర్‌ ఆటో ప్రయానీకులతో వెళుతుండగా రామారెడ్డి మండలం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల మధ్యగల వంతెనపై నుంచి ఆటో అదుపుతప్పి కిందపడడంతో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంలో మృతి చెందిన కళ్యాణ్‌

కామరెడ్డి నుంచి రెడ్డిపేట వెళుతున్న ఆటోలో పదిమంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. వంతెనపై నుంచి ఆటో అదుపుతప్పి కిందపడడంతో రెడ్డిపేటకు చెందిన కళ్యాణ్‌ (28) సంఘటన స్థలంలోనే మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్తితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *