Breaking News

జడ్పిటిసి, ఎంపిటిసి బి ఫాంల పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజుకు జడ్పిటిసి, ఎంపిటిసి బిఫారాలను జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు అందజేశారు.

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని జిల్లా పరిషత్‌ను దక్కించుకోవాలని అన్నారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఇందుకోసం సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉపాధి హామీ పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *