సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా చూడాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం సేకరణలో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యాన్ని నిర్ణీత సమయంలో తూకం వేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల నుండి తీసుకున్న ధాన్యాన్ని వెంట వెంట రైస్‌ మిల్లులకు పంపించడానికి సరిపోయినంతగా లారీలను, కూలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

రైతుల నుండి తీసుకున్న ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా ఏరోజుకారోజు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఏ మేరకు బడ్జెట్‌ అవసరమో ప్రతిరోజు ఉదయం ఇండెంట్‌ పంపాలని ఆదేశించారు. సుమారు 3 లక్షల 50 వేల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉన్నందున ఇప్పటివరకు లక్ష 83 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. గన్నీ బ్యాగుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు సరిపోవు మేరకు తెప్పించాలని ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఇతర చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లైస్‌ జిల్లా మేనేజర్‌ హరి కష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి కష్ణ ప్రసాద్‌, డిసిఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *