Breaking News
వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

విద్యార్థులకు సంపాదన, శ్రమ పట్ల అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుకునే సమయంలోనే విద్యార్థులకు సంపాదన, శ్రమ పట్ల అవగాహన కల్పిస్తే విద్యార్తులు మరింత పరిపక్వత సాధిస్తారని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద వ్యవసాయ క్షేత్రంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌, పాలిటెక్నిక్‌ కళాశాల సంయుక్త సహకారంతో జిల్లా ఉద్యానవన శాఖ నిర్వహిస్తున్న కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకాన్ని ఆయన సందర్శించారు. ఐదెకరాల స్థలంలో డ్రిప్‌, మల్చింగ్‌ పద్దతిలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల భాగస్వామ్యంతో నూతన పరిజ్ఞానంతో జరుగుతున్న హైబ్రిడ్‌ కూరగాయల పెంపకం పనులను పరిశీలించి ఉద్యానవనశాఖ సిబ్బంది, కళాశాల అద్యాపకులు విద్యార్థులను అభినందించారు.

విద్యాభ్యాసం నుంచే సంపాదన అనేది విద్యార్థులకు అలవరిస్తే వారికి పనిపట్ల, శ్రమించడం పట్ల గౌరవం ఏర్పడుతుందని సూచించారు. జిల్లాలో 200 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో 141 కేంద్రాలను ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 57 కోట్ల 29 లక్షల విలువగల 32 వేల 422 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచిసేకరించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి శేఖర్‌, వ్యవసాయ శాఖాధికారి నాగేంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *