Breaking News
వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌

జవాబు పత్రాలు పునఃపరిశీలనకు అన్ని ఏర్పాట్లు

విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ జవాబు పత్రాల పునః మూల్యాంకనకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాదు నుండి ఆయన కలెక్టర్లు, ఇంటర్మీడియట్‌ అధికారులతో మాట్లాడారు. పునః మూల్యాంకనకు, రీకౌంటింగ్‌కు జిల్లాలో అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని తెలిపారు. అందుకు అవసరమగు సెక్రిగేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని బుక్‌ స్కానర్స్‌, బార్కోడ్‌ స్కానర్స్‌, కంప్యూటర్లను సమకూర్చుకోవాలని తెలిపారు.

నిర్ణీత సమయంలో అన్ని పూర్తి చేసి వివరాలను పంపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ, ఈ నెల 26 నుండి పునఃపరిశీలన కొనసాగుతుందని, నిర్ణీత సమయంలో పూర్తి చేస్తున్నామన్నారు. బార్కోడ్‌ స్కానర్‌, బుక్‌ స్కానర్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులకు సమకూర్చామని, కంప్యూటర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను ఏర్పాటు చేశామని, స్కానింగ్‌ కూడా మొదలైందని తెలిపారు. జిల్లాలో 69,728 జవాబు పత్రాలను పునః పరిశీలన చేస్తున్నామని, వీటి వివరాల నమోదు కొనసాగుతున్నదని తెలిపారు. ఇందుకుగాను సుమారు 350 మంది స్కటినైజర్‌లను ఏర్పాటు చేశామన్నారు. నిర్ణీత సమయంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా ఇంటర్మీడియేట్‌ అధికారి ఒడ్డెన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *