Breaking News

శిక్షణకు హాజరుకానివారు కారణాలు తెలపాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీటీసీ, జెడ్‌పిటిసి మొదటి దశ ఎన్నికల కోసం నియమింపబడ్డ పివోలు, ఏపీఓలు శిక్షణ తరగతులకు హాజరుకాని వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకొనుటకు సిఫార్సు చేయడం జరుగుతుందని జిల్లా పరిషత్‌ సీఈవో వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా హాజరుకాని ఏపీఓలు పివోలు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఎందుకు హాజరు కాలేకపోయారో సరైన కారణాలు తెలుపుతూ సంబందిత పత్రాలతో సంజాయిషి తెలుపని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి హెడ్‌ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్‌కు సిఫార్సు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *