Breaking News

Monthly Archives: April 2019

జవాబు పత్రాల పరిశీలనలో తప్పులు లేకుండా చూడాలి

కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ జవాబు పత్రాల పునః పరిశీలనలో ఎటువంటి తప్పులకు అవకాశం లేకుండా కచ్చితంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. స్థానిక జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జవాబు పత్రాల పునః పరిశీలనను ఆయన పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. జవాబు పత్రాల పరిశీలనలో ప్రతి విషయం పక్కాగా చూడాలని మార్కులలో తేడా రాకుండా ఉండాలని ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా పునః పరిశీలన ...

Read More »

ఘనంగా పార్టీ ఆవిర్బావ వేడుకలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బాన్సువాడలో శనివారం కోలాహలంగా జరిగాయి. పట్టణంలోని తెరాస పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మోహన్‌నాయక్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీని గురించి పోచారం భాస్కర్‌రెడ్డి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి ...

Read More »

చౌకధరల దుకాణాలకు 751 ఐరిస్‌ యంత్రాలు

అకున్‌ సబర్వాల్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చౌకధరల దుకాణాల్లో సరుకులు పొందడానికి వేలిముద్రలు ట్యాలీ కాకపోవడంతో ఇబ్బందులను అధిగమించడానికి 751 ఐరిష్‌ యంత్రాలను నిజామాబాద్‌ జిల్లాకు సరఫరా చేసినట్లు పౌరసరఫరాల కమీషనర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్‌ చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల విజ్ఞప్తి మేరకు జిల్లాలోని 751 చౌకధరల దుకాణాలకు యంత్రాలను పంపించామన్నారు. వీటిని మే 1వ ...

Read More »

ఖరీఫ్‌లో రైసు మిల్లుల నుండి రావాల్సిన బియ్యం సరఫరా పై కమిటీ ఏర్పాటుు

అకున్‌ సబర్వాల్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2018-19 ఖరీఫ్‌ సీజన్లో జిల్లాలో 4.89 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొన్నామని అందులో వచ్చిన బియ్యాన్ని ఇంకా 35,000 మెట్రిక్‌ టన్నులు రైస్‌ మిల్లర్స్‌ ఇవ్వవలసి ఉందని దీనికిగాను కమిటీని నియమించడం జరిగిందని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం సంయుక్త కలెక్టర్‌ చాంబర్లో రైసు మిల్లుల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018-19 ...

Read More »

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

బాన్సువాడ, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంగారెడ్డి జిల్లా కల్హేరు మండలం బాచుపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌ నుంచి తుఫాన్‌ వాహనంలో పెళ్లికి వెళుతుండగా బాచపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు బలంగా ఢీకొంది. ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రులకు ప్రజల సహకారంతో పోలీసులు తరలించారు. సంఘటనతో ప్రమాదబారిన ...

Read More »

రైతుల ఖాతాల్లోనే ధాన్యం సేకరణ బిల్లులు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డా. అకున్‌ సబర్వాల్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం సేకరణకు సంబంధించి బిల్లులను రైతుల ఖాతాల్లోకే బదిలీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డా.అకున్‌ సబర్వాల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. ముందుగా పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ చేరుకున్న ఆయన అనంతరం కలెక్టరేట్‌లోని సంయుక్త కలెక్టర్‌ చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యాన్ని రైతుల దగ్గర నుండి మాత్రమే సేకరించాలని వారి ఖాతాలోనే ...

Read More »

ఇంటర్‌ జవాబు పత్రాల పునః పరిశీలనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి

విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ మీడియట్‌ జవాబు పత్రాల పున: పరిశీలనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌ రెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆ శాఖ కమిషనర్‌ అశోక్‌ తో కలిసి ఆయన కలెక్టర్లు, జిల్లా ఇంటర్మీడియేట్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫెయిల్‌ అయిన విద్యార్థుల ఆన్సర్‌ పేపర్లను తిరిగి ...

Read More »

నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలో నీటిసరఫరా అదికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కుళాయిల కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పాత పట్టణంలో రంగుమారిన నీరు సరఫరా అవుతుంది. దీనిపై వార్డు వాసులు, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి స్పందన లభించడం లేదని స్థానికులు వాపోతున్నారు. నీటిశుద్ది కోసం లక్షలాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని మునిసిపల్‌ సమావేశాల్లో నీటి సరఫరా యంత్రాంగం బిల్లులు చూపెట్టి లక్షలాది రూపాయలను ఖర్చుకింద తీసుకుంటుంది. ...

Read More »

విద్యార్థుల జీవితాలతో చలగాటమాడడం సిగ్గుచేటు

పిడిఎస్‌యు కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్‌ బోర్డు తప్పుడు ఫలితాలు వెల్లడించడం వలన 22 మంది విద్యార్థులు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందిదని, ఇంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కాని, ఎమ్మెల్యేలు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సిగ్గు చేటు అని పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎన్‌.ఆజాద్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి ...

Read More »

నామినేషన్ల స్వీకరణ

బాన్సువాడ, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. బాన్సువాడ మండలంలో బాన్సువాడ జడ్పిటిసితోపాటు మండల ప్రాదేశిక స్థానాలకు పోటీ నెలకొంటుంది. మొదటిరోజు అధికార తెరాస తరఫున జడ్పిటిసి స్థానానికి ఒక నామినేషన్‌ దాఖలైంది. ఎంపిటిసి స్థానాలకు 8 నామినేషన్లు రాగా, వీటిలో తెరాస-6, కాంగ్రెస్‌-1, స్వతంత్రులు ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.

Read More »

మొదటిరోజు మూడు నామినేషన్లు దాఖలు

రెంజల్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొరకు రెంజల్‌ మండలం నుండి శుక్రవారం మొదటిరోజు మూడు నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో చంద్రశేఖర్‌ తెలిపారు. మండలం నుండి జడ్పిటిసి కొరకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదన్నారు. రెంజల్‌ ఎంపీటీసీ-1, రెంజల్‌ ఎంపీటీసీ-2, సాటాపూర్‌ నుండి ఒకటి చొప్పున నామినేషన్‌లు దాఖలైనట్లు ఎంపిడివో వెల్లడించారు.

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో బేతాళస్వామి జాతర ఉత్సవాలు అట్టహాసంగా గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. అలంకరణ, ప్రతిబ కనబరిచిన ఎడ్లబండ్లకు ప్రోత్సాహకాన్ని అందించారు. రెండోరోజు శుక్రవారం కుస్తీ పోటీలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక మల్లయోధులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమానం అందించారు. ప్రతియేటా మూడురోజుల పాటు బేతాళ స్వామి జాతర ఘనంగా జరుగుతుంది. వివిధ జిల్లాలతో పాటు సరిహద్దులోని మహారాష్ట్ర, కర్ణాటక ...

Read More »

రెండు నామినేషన్లు వేస్తే ఒకటి ఉపసంహరించుకోవాలి

జిల్లా పరిషత్‌ సీఈవో నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రెండు చోట్ల నామినేషన్‌ వేస్తే ఒకటి తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలని జిల్లా పరిషత్‌ సీఈవో, అడిషనల్‌ డిస్టిక్‌ ఎలక్షన్‌ అథారిటీ వేణు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఒక చోటనే నామినేషన్‌ వేయాలని నిబంధన ఉన్నదని ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు ...

Read More »

పక్కాగా ఎన్నికల ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల సంసిద్ధతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు జరగబోయే గ్రామాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లుతో పాటు ఆయా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ...

Read More »

తెరాస ప్రభుత్వంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడారు. కెసిఆర్‌ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్ఠు పట్టిందని, కేసీఆర్‌కి వసూళ్లపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదని వారు విమర్శించారు. ఇంటర్‌ బోర్డ్‌ రాష్ట్రంలో ఇంత ఘోరంగా విఫలమై 17 ...

Read More »

శుక్రవారం నుంచి రెండోవిడత నామినేషన్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ విడుదల చేసిన ఎంపిటిసి, జడ్పిటిసి సాధారణ ఎన్నికల 2019 నోటిఫికేషన్‌ ప్రకారం కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి రెండోవిడత నామినేషన్లు స్వీకరించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. బాన్సువాడ, బీర్కూర్‌, నసురుల్లాబాద్‌, బిచ్కుంద, మద్నూర్‌, జుక్కల్‌ మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. బాన్సువాడ, మద్నూర్‌, జుక్కల్‌ మండలాల ప్రజలు మండల పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్లు వేయాలని, బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండల ప్రజలు బీర్కూర్‌ మండల పరిషత్‌ ...

Read More »

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు యూనిట్ల మంజూరు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశ్రమలు నెలకొల్పేందుకు కావాల్సిన టిఎస్‌ఐపాస్‌ క్లియరెన్సులపై గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు టిప్రయిడ్‌ ద్వారా 16 యూనిట్లను ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీకింద మంజూరు చేసినట్టు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల అనుమతి మంజూరు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో ఇండస్ట్రి అధికారి రఘునాథ్‌, అధికారులు నాగేంద్రయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెరాసలో పలువురి చేరిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్గుల్‌ ఉపసర్పంచ్‌ భూదేవితోపాటు గ్రామ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భాస్కర్‌, తదితరులు గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాసలో చేరారు. రాష్ట్రంలో కెసిఆర్‌ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులమై తెరాసలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారికి తెరాస కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో మల్లేశ్‌, జీవన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, స్వామి తదితరులున్నారు.

Read More »

మలేరియా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలేరియా వ్యాప్తి చెందకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట మలేరియా అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియా అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జీరో మలేరియా స్టార్ట్స్‌ విత్‌మి అనే థీమ్‌ను ప్రారంభించారు. డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో శోభారాణి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మలేరియా ...

Read More »

ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్‌

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట్‌ గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్‌ అనసూయ గురువారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధి హామీ వల్ల వందలాది మంది కూలీలకు పని దొరుకుతుందని తెలిపారు. చెరువులో పూడిక తీసి ట్రాక్టర్‌తో నింపి పంట పొలాలలో మట్టిని వేసుకోవడం జరుగుతుందని తెలిపారు. కూలీలు ఎండ నుంచి జాగ్రత్త వహించాలని తెలిపారు. కూలీల కోసం చికిత్స కిట్లను టెంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కూలీలకు సగటు ఉపాధి ...

Read More »