Monthly Archives: April 2019

వడదెబ్బతో బాలుని మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవానిరోడ్డుకు చెందిన కుంట కార్తిక్‌ (12) సోమవారం వడదెబ్బతో మృతి చెందినట్టు వార్డు ప్రజలు తెలిపారు. ఎండలో ఆడుకుంటుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.

Read More »

రైతు సమగ్ర సమాచార సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతు సమగ్ర సమాచార సేకరణ పకడ్బందీగా పక్కాగా నిర్వహించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్పరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2 లక్షల 31 వేల 617 కాగా, ఇప్పటి వరకు సర్వేచేసిన రైతుల సంఖ్య 74 వేల 238 పూర్తయిందన్నారు. వ్యవసాయాధికారులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవద్దని, మిగతా సర్వే రెండ్రోజుల్లో పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారం పంపాలని ఆదేశించారు. ...

Read More »

తెరాస గ్రామ అధ్యక్షుడు కాంగ్రెస్‌లో చేరిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట మండలం యాడారం గ్రామ తెరాస అధ్యక్షుడు లక్కరాసు రవి సోమవారం తెరాస పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. భూమాగౌడ్‌, శ్రవణ్‌కుమార్‌, బాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి షబ్బీర్‌ అలీ ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

కార్మికుల సంక్షేమ పథకాల అమలు కోసం ఆందోళన

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయించేందుకు, కార్మికశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనకు సిద్దం కావాలని ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు కల్లూరి ప్రభాకర్‌, గౌరవ అధ్యక్షుడు తిరుపతి పిలుపునిచ్చారు. సోమవారం కామరెడ్డిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికుల ఐక్యత పునరంకిత దినోత్సవంగా మేడేను జరపాలన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాల అమలుకు ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు సురేశ్‌, ఖలీల్‌, సంపత్‌, సత్తార్‌, ప్రకాశ్‌, నాగయ్య, పోచయ్య, ...

Read More »

పబ్జీ గేమ్‌ నిషేదించాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో మచ్చర్ల గ్రామంలో పబ్జీ గేమ్‌ను ఆడకండి ప్రాణాలను బలిపెట్టవద్దని-పబ్జీ గేమ్‌ను నిషేధించాలని సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు దేవారాం, పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌ మాట్లాడుతూ పబ్జీ గేమ్‌ కారణంగా యువత గేమ్‌కు బానిసలై పదుల సంఖ్యలో తమ ప్రాణాలను ఇప్పటికే కోల్పోయారని అనేక మంది మానసిక రోగులుగా తయారవుతున్నారని అన్నారు. కావున పబ్జీ గేమ్‌ను ఆడవద్దని, ప్రభుత్వం పబ్జీ గేమ్‌ను నిషేధించాలని ...

Read More »

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సర్వసన్నద్దం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జెడ్‌పిటిసి, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినందున జిల్లాలో మూడు విడతలుగా డివిజన్‌ వారిగా జరగనున్నాయని జిల్లాలో 27 జెడ్పిటిసిలకు, 299 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు సమర్ధవంతమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏడు ...

Read More »

మీడియా సహకారం భేష్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అసెంబ్లీ, గ్రామపంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా మీడియా సహకరించడం వలన ఎన్నికల సమాచారం ఎప్పటి కప్పుడు ప్రజలకు చేరవేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించినందున జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఓటర్ల అవగాహనతో పాటు నమోదు పక్రియలో కూడా మీడియా ప్రక్యేక శ్రద్దపెట్టినందున పెద్ద మొత్తంలో జిల్లాలో ఎక్కువ మంది ఓటరు నమోదు చేశారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా తమ వంతు కషి ...

Read More »

పార్టీ కోసం కష్టపడ్డవారికి గుర్తింపు ఉంటుంది

బీర్కూర్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్‌ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. సోమవారం బీర్కూర్‌లో తెరాస పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడతలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎన్నుకుందామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. బీర్కూర్‌ మండలంలోని అన్ని ఎంపీటీసీలను అదేవిధంగా జడ్పీటీసీని భారీ మెజారిటీతో ...

Read More »

సీసీ కెమెరాల కోసం విరాళాల సేకరణ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జక్కాపూర్‌ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం విరాళం స్వీకరించారు. స్వీకరించిన విరాళం 20 వేల రూపాయలను ఎస్‌ఐ సాయన్న ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌ బంజా కంసవ్వ బసప్ప సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే నిర్వాహకునికి అందజేశారు. వారి వెంట గ్రామస్తులు ఉన్నారు.

Read More »

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆదివారం ఎంపీడీవో ఆర్‌ఒ ఈఓపిఆర్‌డి లతో వీడియో కాన్పరెన్సు ద్వారా మాట్లాడారు. 22 ఏప్రిల్‌ 2019 సోమవారం నుండి నిజామాబాద్‌ డివిజన్లో జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని 24 ఏప్రిల్‌ 2019 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, మే 6వ తేదీన పోలింగ్‌ నిర్వహించాలని అందుకోసం అధికారులు ఏలాంటి లోటు పాట్లు ...

Read More »

దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ఇంటర్‌ బోర్డు విడుదలచేసిన ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, అయినా పట్టించుకోవడం లేదని కామారెడ్డి ఏబివిపి నాయకులు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంటర్మీడియట్‌ ఫలితాలలో అవకతవకలకు పూర్తి బాధ్యత వహిస్తూ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబివిపి విద్యార్థి నాయకులు ఉన్నారు.

Read More »

ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపొద్దు

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులలో ఎలాంటి పక్షపాతం చూపించకూడదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ ఏం.పి.డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా సమయ పాలన ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ నెల 22 నుడి 24 వరకు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ ...

Read More »

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలు తిరిగి సిబ్బందిని. వారు చేస్తున్న పని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్‌వార్డు మరియు అవుట్‌ వార్డు సెక్షన్లలో వస్తున్న టప్పాల్స్‌ గురించి సంబంధిత గుమాస్తాలను అడిగి తెలుసుకున్నారు. విభాగాల సిబ్బంది తప్పనిసరిగా పర్సనల్‌ రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. సంబంధిత పర్యవేక్షకులు ఈ విషయమై ప్రతి రోజు పరిశీలన చేయాలని ఆయన ఆదేశించారు.

Read More »

పండ్లరసాలు వాటి ఉపయోగాలు

వెల్లుల్లి వెల్లుల్లి చాలా శక్తివంతమైన యాంటిసెప్టిక్‌. వెల్లుల్లి రసాన్ని అంతే మొత్తంలో నీటికి కలిపి తీసుకుంటే కలరా క్రిములు నశిస్తాయి. వెల్లుల్లిని టైఫాయిడ్‌ నిరోధించడానికి వాడవచ్చు. దీనిలో ఉండే సల్ఫాయిడ్‌ నూనె ముఖ్యమైనది. శ్వాసవ్యాధులకు, న్యుమోనియా సమస్యలకు ఇది అద్భుతమైన మందు. న్యుమోనియా లక్షణాలు అయిన టెంపరేచర్‌, శ్వాస, నాడి అవకతవకలను కేవలం ఏడు రోజులలోనే వెల్లుల్లి రసం వాడటం వలన మాములు స్థితికి తేబడ్డాయి. ఎటువంటి కడుపుబ్బరానికి అయినా , పక్షవాతం, శరీరం మొత్తం పట్టేయడం, గుండె సమస్య, కడుపునొప్పి, ఎన్నో రోగాలను ...

Read More »

ఉపాధి హామీ పనులు పరిశీలన

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను గ్రామ పంచాయతి కార్యదర్శి లక్ష్మణ్‌ శనివారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆయన వెంట ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బాలరాజు ఉన్నారు.

Read More »

ప్రజల కోసం పని చేస్తున్నామనే భావన కలిగి ఉండాలి

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ కార్యదర్శులు పనిచేస్తున్నది ప్రజల కోసం అనే భావనతో ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఉద్బోధించారు. శనివారం స్థానిక రాజీవ్‌ గాంధి ఆడిటోరియంలో కొత్తగా నియామకమైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగాలు పొందినందుకు వారికి ముఖాముఖి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకు వచ్చిన కొత్త పంచాయతి రాజ్‌ చట్టం వచ్చిన తర్వాత ...

Read More »

ఒంట్లో రక్తం పెరగాలంటే

అనీమియా చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అనీమియాను అధిగమించం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. ఇంట్లో ఉన్న వస్తువులతో అనీమియా నుంచి బయటపడవచ్చు అంటున్నారు. అంతేకాదు రక్తం పెరగడానికి చాలా సులువైన మార్గాలు వున్నాయంటున్నారు. ఒక ఆపిల్‌, ఒక టమోటా కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగాలి. అలాగే బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్‌, మినరల్స్‌ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ...

Read More »

గ్రామాభివద్ధికి క షి చేస్తా

మహమ్మద్‌ నగర్‌ సర్పంచ్‌ దఫేదార్‌ బాలమణి నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ అభివద్ధికి కషి చేస్తానని దఫేదార్‌ బాలమణి అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన గ్రామ సభకు సర్పంచ్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రామాభివద్ధికి ఎల్లప్పుడు తోడ్పడి అభివద్ధి చేశానని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తామన్నారు. అలాగే గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ...

Read More »

గ్రామ గ్రామాన అన్నసత్రాలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని మండలంలోని ఆయా గ్రామాల్లోని హనుమాన్‌ ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి సిందూరపూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్‌ ఆలయాల వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం ఏర్పాటుచేశారు. పలు గ్రామాల్లో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు. యువకులు కేరింతలు కొడుతూ ...

Read More »

సృజన సంగమం పుస్తకావిష్కరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం ఎన్నీల ముచ్చట్లు ఏడాది పండుగ నిర్వహించారు. స్థానిక కర్షక్‌ బిఇడి కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండి మల్లారెడ్డి విచ్చేసి సృజన సంగమం పుస్తకావిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు అక్షరాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండించాలన్నారు. ప్రశ్నించడం నేరం కాదని, కవులు, రచయితలు తమ బాధ్యతను విస్మరించరాదన్నారు. కామరెడ్డిలో ఎన్నిల ముచ్చట్లు ప్రారంభమై ఎంతోమంది యువకవులను తయారుచేసిందన్నారు. జిల్లా అధ్యక్షుడు ...

Read More »