Breaking News
బిఫారాలు అందిస్తున్న పోచారం భాస్కర్‌రెడ్డి

బిఫాంల అందజేత

బాన్సువాడ, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశిక స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులకు తెరాస పార్టీ బిఫాంలు అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు, దేశాయ్‌పేట్‌ సింగిల్‌విండో అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి పోటీదారులకు బిఫాంలు అందించారు.

బుధవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్‌, నసురుల్లాబాద్‌, వర్ని, రుద్రూర్‌, కోటగిరి, చందూరు, మోస్రా మండలాల్లో జడ్పిటిసి మండల ప్రాదేశిక స్థానాలకు పోటీపడుతున్న అబ్యర్థులకు బిఫారాలు అందించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

రూ. 2.51 కోట్లతో రెండు పడక గదుల‌ ఇళ్ళు

బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం రాంగంగానగర్‌ గ్రామంలో ...

Comment on the article