Breaking News

సూక్ష్మ పరిశీలకుల పాత్ర ముఖ్యమైంది

నిజామాబాద్‌, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జరుగు జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిష్పక్షపాతంగా సజావుగా జరిగేందుకు కషి చేయాలని జిల్లా పరిశీలకులు అభిలాష్‌ బిస్టు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరుగు సూక్ష్మ పరిశీలకుల శిక్షణా తరగతిలో మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఓటర్లను ప్రలోభాలకు ఇతర చర్యలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్‌ కీలకమైనందున సూక్ష్మ పరిశీలకుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని పోలింగ్‌ స్టేషన్‌లో ఓటింగ్‌ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని మీరు నాకు రెండు కళ్లు వంటివి వారని చెప్పారు. సెన్సిటివ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ పోలింగ్‌ సందర్భంగా సూక్ష్మ పరిశీలకుల పాత్ర ముఖ్యమైనదని ఎన్నికల సందర్భంగా నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

శిక్షణ తరగతులు సందేహాలను నివత్తి చేసుకోవడంతోపాటు సలహాలు సూచనలు కూడా అందజేయవచ్చునని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారంగా తమ విధులను పూర్తిస్థాయిలో బాధ్యతయుతంగా నిర్వహించి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన చెక్‌ లిస్టులను తరచుగా పరిశీలన చేసుకోవాలన్నారు. ఎడమ చేయి మధ్య వేలుకు చుక్క వేయాలని ప్రజాస్వామ్య ప్రక్రియలో విధాన సభ పార్లమెంట్‌ ఎన్నికలు ఎంత ప్రాముఖ్యత ఉందో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అంతా ప్రాముఖ్యత ఉంటుందని, దీన్ని దష్టిలో పెట్టుకొని తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని ఆయన అన్నారు. శిక్షణ తరగతులలో జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *