Breaking News
గుగులోత్‌ మమతను అభినందిస్తున్న మానస గణేశ్‌ తదితరులు

సాప్ట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్న గుగులోత్‌ మమత

ఆర్మూర్‌, మే 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ నెల 27 నుండి 30 వరకు నలంద హై స్కూల్‌ క్రీడా మైదానంలో జరిగిన ఆరవ రాష్ట్రస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలలో మానస హై స్కూల్‌ విద్యార్థిని గూగులోత్‌ మమత పాల్గొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి బెస్ట్‌ క్యాచర్‌ అవార్డుని రాష్ట్ర సాప్ట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కే.శోభన్‌ బాబు చేతుల మీదుగా అందుకుంది.

ఈనెల 23 నుండి 27 వరకు ఆర్మూర్‌లో జరగనున్న జూనియర్‌ జాతీయ స్థాయి పోటీల రాష్ట్ర ప్రాబబుల్స్‌ జట్టుకు ఎంపికై శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా సాప్ట్‌బాల్‌ క్రీడాకారిణి గూగులోత్‌ మమతను, ఇందుకు కషిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వినోద్‌ను రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కే.శోభన్‌ బాబు, మానస హై స్కూల్‌ కరస్పాండెంట్‌ మానస గణేష్‌, జిల్లా సాప్ట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.గంగా మోహన్‌ అభినందించారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *