నామినేషన్‌ పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యనారాయణ

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, మే 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో మూడోవిడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మూడో విడత నామినేషన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నిజాంసాగర్‌, ఎల్లారెడ్డి, ఎంపిడిఓ కార్యాలయాల్లో నామినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 6వ తేదీన మొదటివిడత కింద 99 జడ్పిటిసి, 88 ఎంపిటిసి, మే 10న రెండో విడత కింద 7 జడ్పిటిసి, 77 ఎంపిటిసి, మే 14న మూడో విడత కింద 6 జడ్పిటిసి, 71 ఎంపిటిసి లకు పోలింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు.

మొత్తం 22 జడ్పిటిసి, 236 ఎంపిటిసి ఎన్నికలకు 1294 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మూడో విడత ఎన్నికల్లో మొత్తం 6 లక్షల 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు వివరించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లతోపాటు పోలీసు భద్రత తదితర ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఎంపిడివోలు చిన్నారెడ్డి, పర్బన్న, తహసీల్దార్‌ సంజీవరావు, రిటర్నింగ్‌ అధికారులు దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌ డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *