Breaking News

Daily Archives: May 3, 2019

ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మొదటి దశలో నిజామాబాద్‌ డివిజన్లో జరుగు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఏలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌ డివిజన్‌లోని ధర్పల్లి, సిరికొండ మండలాలలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులకు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ధర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ వివరాలను ...

Read More »

సామాగ్రి పంపిణీలో లోపాలు ఉండకూడదు

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీటిసి ఎంపిటిసి ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శుక్రవారం పరిశీలించారు. పోలింగ్‌కు సంబంధిన అవసరమైన పత్రాలు, సామాగ్రి పంపిణీ లోటుపాట్లు ఉండకూడదని అర్‌ఓకు ఆదేశాలు జారీచేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో త్రాగునీరు. టెంట్‌, ఓఅర్‌యస్‌ ప్యాకెట్లు, వికలాంగులకు వీల్‌చేర్లు లాంటి వసతులు తప్పని సరిగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

Read More »

సర్వీసు ఓట్లను స్కాన్‌ చేయాలి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సర్వీస్‌ ఓట్లకు పంపించిన ఈ పోస్టల్‌ బ్యాలెట్‌లను స్కాన్‌ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ సాంకేతిక అధికారి వి.ఎన్‌.శుక్ల తెలిపారు. శుక్రవారం ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ఎలక్షన్‌ అధికారులు జిల్లా ఎన్నికల అధికారులతో ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ గురించి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ కు వచ్చిన ఫారం 13 మొదటగా స్కానింగ్‌ చేయాలని ఆ తర్వాత ...

Read More »

కార్మికులకు 8500 వేతనం అమలు చేయాలి

ఆర్మూర్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు మండల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి (ఐఎఫ్‌టియు) దాసు పాల్గొని ప్రసంగించారు. సఫాయి కార్మికులు నిజమైన దేవుడని సెల్యూట్‌ కొట్టిన కేసిఆర్‌ కార్మికులు నెల రోజుల సమ్మె చేస్తే నెలకు రూ.8500 వేతనం ఇస్తామని ప్రకటించి నేటికి అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. పరిసరాల పరిశుభ్రతలో పంచాయతీ కార్మికులు ప్రధాన పాత్ర నిర్వహిస్తూ, ప్రజారాజ్యం ...

Read More »

ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్‌ ద్వారా రైతుల గుర్తింపు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన మొక్కలను పెంచడానికి రైతులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్లో జిల్లాస్థాయి ఆగ్రో ఫారెస్ట్రీ మిషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ మిషన్‌ ద్వారా వెదురు, టేకు, గంధపు మొక్కలు, సరుగుడు పెంచడానికి రైతులను ప్రోత్సహించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెట్ల ...

Read More »

ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తోంది

ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తోంది? మన తెలుగు అక్షరాలలో ‘అమ్మ’లో ‘అ’లా ఉంది కదా ! కానీ ఇది ఆస్ట్రేలియాలో పిల్లల ఆసుపత్రి దగ్గర ఉన్న భవంతి పైన చిహ్నం. తల్లి బిడ్డను హదయానికి హత్తుకున్నట్లుగా చూపిన పాశ్చాత్యుల భావన. మనం తెలుగులో నేర్చుకునే మొదటి మాట అమ్మలో ‘అ’ కి ఎంత అద్భుతంగా ఇమిడిపోయిందో కదా! అదీ మన తెలుగు గొప్పతనం.

Read More »

5న యోగా పోటీలు

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో యోగ ఒలంపియాడ్‌ అండర్‌ 17,14 బాలబాలికలకు నిజామాబాదులోని బాలభవన్‌లో ఈనెల 5 వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి బి.పవన్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో గెలుపొందిన బాల బాలికలకు రాష్ట్రస్థాయి యోగా ఒలింపియాడ్‌ పోటీలు హైదరాబాదులో ఈ నెల 10 నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. అండర్‌ 17 విభాగంలో ...

Read More »