Breaking News

Daily Archives: May 5, 2019

మొదటి విడత నేడే

పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలు నైతికతను పాటించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లాలో మొదటి విడత జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిజామాబాద్‌ డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్‌ మోపాల్‌, నవీపేట నిజామాబాద్‌, సిరికొండ మండలాలలో 8 జడ్పీటిసిలు, 100 ఎంపీటీసీలు కాగా అందులో 7 జడ్పీటిసి లకు, 94 ఎంపిటిసిలకు ఎన్నికలు ...

Read More »

కేసీఆర్‌ తోనే గ్రామాల అభివద్ధి

నిజాంసాగర్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. ఆదివారం నిజాంసాగర్‌ మండలంలోని అరెపల్లి గ్రామములో హనుమాన్‌ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ పాలనలో అన్ని గ్రామాల అభివద్ధి జరిగిందని అలాగే జరగనున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు, సిడిసి చైర్మన్‌ దుర్గా రెడ్డి, టిఆర్‌ఎస్‌ ...

Read More »

ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి

నిజాంసాగర్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రములో ఆదివారం బండప్పా ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పాల్గొని ప్రసంగించారు. జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఆయా రంగాల్లో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం అభివద్ధిలో ముందంజలో ఉందని అన్నారు. కెసిఆర్‌ పాలనలో రైతులకు పెద్ద పీట వేయడం జరిగిందని, రైతు సంక్షేమమే తెలంగాణ సంక్షేమం అని అన్నారు. ...

Read More »

టిఆర్‌ఎస్‌లో చేరికలు

నిజాంసాగర్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. బిచ్కుంద బండప్ప ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు. అనంతరం పుల్కల్‌, వాజిద్‌ నగర్‌ గ్రామానికి చెందిన పలువురు తెరాసలో చేరారు. హన్మంత్‌షిండే గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »

కోర్టుల ఆధునీకరణకు కసరత్తు చేయాలి

రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్‌ అవసరాల మేరకు ఉమ్మడి జిల్లాలోని కోర్టుల ఆధునీకరణతో పాటుగా మౌలిక సదుపాయాలు కల్పన యిప్పటినుండే కసరత్తుతోపాటు అవసరమైన ప్రణాళికతో ముందుకు పోవాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఆదివారం ఉదయం జిల్లా కోర్టుప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా కోర్ట్‌లతో పాటుగా జిల్లా కోర్టులో కనీస వసతుల విస్తరణపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా చీఫ్‌ ...

Read More »

మొదటి విడత ఎన్నికల కౌంటింగ్‌ నిర్మల హృదయ పాఠశాలలో

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొదటి విడత జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్‌ నగరంలోని నిర్మల్‌ హదయ్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. నిర్మల్‌ హదయ పాఠశాల ప్రధాన బిల్డింగ్‌కు దక్షిణ వైపుగల భవనంలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ డివిజన్‌లో 8 మండలాలలో మొదటి విడత జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు ఈనెల ఆరవ తేదీన జరగనుంది. మొదటి అంతస్తులో నిజామాబాద్‌ మోపాల్‌ మండలాలు కౌంటింగ్‌ ...

Read More »

తెరాసలో చేరిన ఆయా పార్టీల కార్యకర్తలు

బీర్కూర్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రోజు బీర్కూర్‌లో రాష్ట్ర యువ నాయకులు, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పోచారం భాస్కర్‌ రెడ్డి, బీర్కూర్‌ మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు తెరాస పార్టీలో చేరారు. వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు ఘన స్వాగతం

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహన్‌ ఆదివారం ఉదయం జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆర్‌అండ్‌బి అతిథిగహంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జ్ఞాపకార్థం చీఫ్‌ జస్టిస్‌కు మొక్కను బహుకరించారు. అంతకుముందు జిల్లా సెషన్‌ జడ్జి శ్రీసుధ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, కామారెడ్డి జిల్లా ఎస్పి శ్వేత రెడ్డి జిల్లాకు చెందిన ఆయా కోర్టు జడ్జిలు రత్నప్రభ, గోవర్ధన్‌ రెడ్డి, గౌతమ్‌ ప్రసాద్‌ ...

Read More »