Breaking News

Daily Archives: May 9, 2019

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకోసం అధికారులకు ముందస్తు శిక్షణ

నిజామాబాద్‌ ప్రతినిధి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి మొదటి దశలోనే మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తిచేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనున్నందున, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్‌.ఓలకు), సహాయ రిటర్నింగ్‌ అధికారులకు (ఎ.ఆర్‌.ఓలకు), ఇతర సంబంధిత అధికారులకు హైదరాబాద్‌లో గురువారం ఒక శిక్షణా శిబిరాన్ని నిర్వహించినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి డా.రజత్‌ కుమార్‌ వెల్లడించారు. సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ...

Read More »

టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయం

నిజాంసాగర్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి, మాగి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి శోభ, ఎంపీటీసీలకు మద్దతుగా ప్రచారం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉందని టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామ అభివద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరిగిందన్నారు. రైతు బంధు పథకం ...

Read More »

జెడ్పిటిసి అభ్యర్థి ధపెదార్‌ శోభకు సన్మానం

నిజాంసాగర్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట్‌ గ్రామంలో ఎంపిటిసి అభ్యర్థి చాకలి సుజాత, జెడ్పిటిసి అభ్యర్థి ధపెదార్‌ శోభకు పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే అచ్చంపేట్‌ గ్రామ సర్పంచ్‌ అనసూయ శాలువాతో పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో సిడిసి చైర్మన్‌ దుర్గా రెడ్డి, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ గైని విట్ఠల్‌, నాయకులు కాశయ్య, మహేందర్‌, విజయ్‌, డిసిసిబి డైరెక్టర్‌ మోహన్‌ రెడ్డి, మాగి గ్రామ సర్పంచ్‌ కమ్మర్‌ కత్త అంజయ్య, తదితరులు ఉన్నారు.

Read More »

రూ.19వేలకు ఇసుక వేలం

రెంజల్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన ఇసుక వేలంలో నీల, రెంజల్‌ గ్రామాలకు చెందిన వ్యాపారులు రూ.19 వేలకు దక్కించుకున్నట్లు తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ తెలిపారు. ఇటీవల నీలా గ్రామ శివారులో అక్రమంగా తరలించేందుకు నిల్వ ఉంచిన 14 ట్రాక్టర్ల ఇసుకను రెంజల్‌ పోలీసులు గుర్తించి రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తహసిల్దార్‌ కార్యాలయంలో ప్రారంభమైన ఇసుక వేలంలో రూ.19 వేలకు ...

Read More »

ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా చూడండి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి సేకరిస్తున్న వరి ధాన్యానికి రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన చాంబర్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోనె సంచులు వీలైనంత ఎక్కువగా అందుబాటులో ఉంచాలని, వాటిని ఎక్కడ నుండి లభిస్తే అక్కడ నుండి తెప్పించాలని తెలిపారు. అదేవిధంగా ధాన్యం సేకరణలో నిర్ణీత ...

Read More »

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

రెంజల్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో బాల్యవివాహాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో గురువారం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల, తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ చేరుకుని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. మండల కేంద్రానికి చెందిన వధువు, వరుడు ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వరుడి కనీస వయస్సు 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలని అప్పుడే వివాహానికి అర్హులని సూచించారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Read More »

రెండవ విడత కు సర్వం సిద్ధం

పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది రెంజల్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ డివిజన్‌ పరిధిలోని రెంజల్‌ మండలంలో శుక్రవారం రెండవ దశ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మండలంలో 11 ఎంపీటీసీ, 1 జడ్పీటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గురువారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి అధికారులు సామాగ్రిని పంపిణీ చేశారు. బస్సులు ఇతర వాహనాల్లో పోలింగ్‌ సిబ్బందిని వారికి కేటాయించిన కేంద్రాలకు తరలించారు. శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ...

Read More »

నేడు రెండోవిడత

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ డివిజన్‌లో రెండో విడత జడ్పీటిసి ఎంపిటిసి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసినందున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లాలో రెండో విడత జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు బోధన్‌ డివిజన్‌లోని 8 మండలాల్లో ఈ నెల 10 వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగతుందని చెప్పారు. 8 జడ్పీటిసిలు, ...

Read More »