Breaking News

టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయం

నిజాంసాగర్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి, మాగి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి శోభ, ఎంపీటీసీలకు మద్దతుగా ప్రచారం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉందని టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామ అభివద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరిగిందన్నారు. రైతు బంధు పథకం కింద రైతన్నలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. నిరుపేద ఆడపడుచుల కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను చేపట్టడం జరిగిందన్నారు.

వద్ధులకు, వికలాంగులకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పింఛన్లు పెంచిన ఘనత ఉందన్నారు. ఆడపడుచుల కోసం మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్ల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కాలేశ్వరం నీటితో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలాగా మారుతుందని అన్నారు. వేరే రాష్ట్రాలు తెలంగాణ అభివద్ధి వైపు చూస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వద్ధులకు వికలాంగులకు 200 రూపాయలు పెన్షన్లను ఇచ్చేవారని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో హయాంలో వికలాంగులకు పదిహేను వందల రూపాయలు, వద్ధులకు వేయి రూపాయల ఫింఛను ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిడిసి చైర్మన్‌ దుర్గారెడ్డి , ఏఎంసి వైస్‌ చైర్మన్‌ గైని విట్టల్‌, సర్పంచ్‌ అనసూయ సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ గోడల రేఖ, నాయకులు బలరాం, తదితరులు ఉన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *