Breaking News
ఇసుక వేలం నిర్వహిస్తున్న తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌

రూ.19వేలకు ఇసుక వేలం

రెంజల్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన ఇసుక వేలంలో నీల, రెంజల్‌ గ్రామాలకు చెందిన వ్యాపారులు రూ.19 వేలకు దక్కించుకున్నట్లు తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ తెలిపారు. ఇటీవల నీలా గ్రామ శివారులో అక్రమంగా తరలించేందుకు నిల్వ ఉంచిన 14 ట్రాక్టర్ల ఇసుకను రెంజల్‌ పోలీసులు గుర్తించి రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తహసిల్దార్‌ కార్యాలయంలో ప్రారంభమైన ఇసుక వేలంలో రూ.19 వేలకు వ్యాపారులు దక్కించుకున్నట్లు తహసిల్దార్‌ తెలిపారు. నాయబ్‌ తహసీల్దార్‌ గంగాసాగర్‌, గీర్దావర్‌ సాయిలు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *