Breaking News
కౌన్సెలింగ్‌ పత్రాన్ని అందజేస్తున్న తహసీల్దార్‌

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

రెంజల్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో బాల్యవివాహాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో గురువారం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల, తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ చేరుకుని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. మండల కేంద్రానికి చెందిన వధువు, వరుడు ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివాహాన్ని అడ్డుకున్నారు.

ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వరుడి కనీస వయస్సు 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలని అప్పుడే వివాహానికి అర్హులని సూచించారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *