Breaking News

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకోసం అధికారులకు ముందస్తు శిక్షణ

నిజామాబాద్‌ ప్రతినిధి, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి మొదటి దశలోనే మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తిచేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనున్నందున, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్‌.ఓలకు), సహాయ రిటర్నింగ్‌ అధికారులకు (ఎ.ఆర్‌.ఓలకు), ఇతర సంబంధిత అధికారులకు హైదరాబాద్‌లో గురువారం ఒక శిక్షణా శిబిరాన్ని నిర్వహించినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి డా.రజత్‌ కుమార్‌ వెల్లడించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

మే 23 ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమయిన దగ్గరనుంచీ ఏఏ స్ధాయిలో ఏఏ ఓట్లు ఎలా లెక్కించాలి, లెక్కించడానికి అవసరమయిన మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి, ఎన్నికల ఏజంట్లతో ఎలా వ్యవహరించాలి, ఇవిఎంలు, వివిపాట్లలో ఓట్లు ఎలా లెక్కించాలి, పరిశీలకుల సంతకాలకు ఉన్న ప్రాముఖ్యతవంటి అంశాలలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలతోపాటూ, లెక్కింపు ఎలా జరపాలన్న విషయాలను కూడా శిబిరంలో ఆచరణాత్మకంగా కూడా వివరించినట్లు ఆయన తెలియ చేసారు.

దేశంలోనే అత్యధికంగా దాదాపు 185 మంది అభ్యర్ధులు పోటీపడిన నిజామాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి 18 టేబుళ్ళను ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే అత్యధిక ఓటర్లున్న మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి సంబంధించి 24 టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నట్లు డా.కుమార్‌ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం కన్సల్టెంట్‌, మాజీ ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌, డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి, జాయింట్‌ సిఇఓ ఆమ్రపాలి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *