Breaking News

Daily Archives: May 10, 2019

టిఆర్‌ఎస్‌ తోనే అభివద్ధి

నిజాంసాగర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌తోనే అభివద్ధి జరుగుతుందని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని తుంకి పల్లి, కొమలంచ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఎలాంటి అభివద్ధి జరగలేదని విమర్శించారు. 70 సంవత్సరాలలో కాని అభివద్ధి కేసీఆర్‌ పాలనలోనే నాలుగు సంవత్సరాలు చేసి చూపించిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కిందని అన్నారు. గ్రామాలలో సిసి రోడ్లు, మురికి కాలువలు నిర్మించడం ...

Read More »

నిజాంసాగర్‌కు కాళేశ్వరం నీరు

నిజాంసాగర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎప్పుడు కాళేశ్వరం నీటితో నిండుకుండల్లా వుంటుందని ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని బూర్గుల్‌, తుంకిపల్లి, కోమలంచ గ్రామాల్లో గల్లీ గల్లీకి పర్యటించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కల్పించాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జడ్పిటిసి అభ్యర్థి ధపెదర్‌ శోభను, తుంకిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి లచ్చవ్వ, బూర్గుల్‌ ఎంపిటిసి అభ్యర్థి లచ్చమ్మ, కోమలంచ ఎంపీటీసీ అభ్యర్థి సావిత్రిలను ...

Read More »

ఎమ్మెల్యే షిండేకు సన్మానం

నిజాంసాగర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా కోమలంచ, బూర్గుల్‌, తుంకిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ చైర్మన్‌ మోహిజోద్దీన్‌ వారిని పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్యానెల్‌ స్పీకర్‌ మాట్లాడుతూ గ్రామాలలో టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో సిడిసి చైర్మన్‌ దుర్గారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గైని విట్ఠల్‌, నాయకులు తదితరులు ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ బీబీ పాటిల్‌

నిజాంసాగర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలములోని సిర్పూర్‌ గ్రామములో ఎంపి బి.బి.పాటిల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు జడ్పీటీసీలు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. గ్రామాల్లోని కెసిఆర్‌ పాలనలో అన్ని గ్రామాల అభివద్ధి జరుగుతుందని అన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలోనే వికలాంగులకు పదిహేను వందల రూపాయలను వద్ధులకు వేయి రూపాయల ఫింఛను ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలో వికలాంగులకు 3016 రూపాయలు, వద్ధులకు 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ ...

Read More »

యువకుని ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులోగల ఎస్‌ఆర్‌ ప్రయివేటు ఫైనాన్స్‌ వేదింపులు భరించలేక బింగి బాల్‌రాజ్‌ అనే యువకుడు శుక్రవారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికులు గమనించి యువకుని శాంతింపజేసి అఘాయిత్యం చేసుకోకుండా అడ్డుకున్నారు. ప్రయివేటు ఫైనాన్స్‌ ప్రతినిదులు డబ్బు కోసం వేదిస్తున్నారని, అధిక వడ్డిలు వసూలు చేస్తు పీడిస్తు మానసికంగా వేదింపులకు గురిచేస్తున్నారని బాల్‌రాజ్‌ చెప్పాడు.

Read More »

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు విదిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం వాటరింగ్‌ డే సందర్భంగా జాతీయ రహదారిపై డివైడర్‌ మధ్యలోని మొక్కలకు నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలన్నా, ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించుకోవాలన్నా మొక్కల సంరక్షణ తప్పనిసరి అని చెప్పారు. విస్తృతంగా మొక్కలునాటి భావి తరాలకు పచ్చదనాన్ని అందించాలని ప్రకృతిని సంరక్షించుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా అటవీశాఖాధికారి వసంత, అధికారులు ...

Read More »

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల పరిశీలన

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో శుక్రవారం జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి రెండో విడత ఎన్నికలను కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ కంట్రోల్‌ రూం ద్వారా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. జిల్లాలోని బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్‌, జుక్కల్‌, మద్నూర్‌, నసురుల్లాబాద్‌, పెద్ద కోడప్‌గల్‌ మండలాల్లో శుక్రవారం రెండో విడత పోలింగ్‌ జరిగింది. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కలెక్టర్‌ ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల తీరుపై సమీక్షించారు. అక్కడి నుంచి అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తు ఎన్నికలు సజావుగా ...

Read More »

ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌ రూం ఏర్పాట్లను, బందోబస్తు తీరును శుక్రవారం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు అభిలాష్‌ బిష్టు పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత, ఆర్డీవో రాజేశ్వర్‌, ప్రత్యేకాధికారి నాగేంద్రయ్య, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

Read More »

రెండో విడతలో 74.86 శాతం పోలింగ్‌

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పిటిసి, ఎంపిటిసి రెండో విడత ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో మొత్తం 74.86 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా పెద్ద కోడప్‌గల్‌లో 81.94 శాతం ఓటింగ్‌ నమోదుకాగా, అత్యల్పంగా బిచ్కుందలో 73.81 శాతం పోలింగ్‌ నమోదైంది. బాన్సువాడలో 73.84 శాతం, బిచ్కుందలో 73.81 శాతం, బీర్కూర్‌లో 74.67, జుక్కల్‌లో 74.30 శాతం, మద్నూర్‌లో 74.36 శాతం, నసురుల్లాబాద్‌లో 75.14 శాతం ...

Read More »

రెంజల్‌లో ప్రశాంతంగా ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌

రెంజల్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండవ విడత ప్రాదేశిక ఎన్నికలు బోధన్‌ నియోజకవర్గంలోనీ రెంజల్‌ మండలంలో శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ, 1 జడ్పిటిసి స్థానాలకు గాను 54 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేసి పోలింగ్‌ నిర్వహించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల అధికారులతో పాటు ఓటర్లకు పూర్తి సౌకర్యాలు కల్పించినట్లు మండల ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం నుండి ఎండలు అధికంగా ఉండడంతో పోలింగ్‌ మందకొడిగా సాగింది. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ...

Read More »

రెంజల్‌లో పోలింగ్‌ సరళిని పరిశీలించిన సిపి

రెంజల్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డివిజన్‌ పరిధిలోని రెంజల్‌ మండలంలో జరుగుతున్న జడ్పిటిసి, ఎంపిటిసి రెండో విడత ఎన్నికల సందర్భంగా రెంజల్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్‌ ఎస్‌పి శ్రీధర్‌ రెడ్డి, బోధన్‌ ఏసిపి రఘు, సిఐలు షకీర్‌ అలీ, నరేష్‌, ఎస్సై శంకర్‌ ఉన్నారు.

Read More »

బీర్కూర్‌లో 74.67 శాతం పోలింగ్‌

బీర్కూర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 74.67 ఓటింగ్‌ శాతం నమోదు అయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా పురుషులు 6593 మంది, స్త్రీలు 7161 మంది కలిపి మొత్తం 13,754 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే నసురులబాద్‌ మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 75.14 ఓటింగ్‌ శాతం నమోదు కాగా ...

Read More »

ఓటుహక్కు వినియోగించుకున్న స్పీకర్‌

బాన్సువాడ, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వారు సొంతగ్రామం బాన్సువాడ మండలం పోచారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More »

ఘనంగా బోనాల పండగ

బాన్సువాడ, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని బారడి పోచమ్మ దేవాలయం నాలుగవ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాత బాన్సువాడలోని చావిడి నుండి పట్టణ శివారులోని ఆలయం వరకు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు బోనాలు ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ తరఫున నగలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు ఎర్వల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపులో ఏలాంటి తప్పులకు తావివ్వకుండా రిటర్నింగ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత ఎన్నికల సంఘం ఐటీ డైరెక్టర్‌ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు జిల్లా ఎన్నికల అధికారులతో సువిధలో కౌంటింగ్‌ నమోదు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ వివరాలు సువిధ అప్లికేషన్‌లో నమోదు చేయాలని, అందుకు సంబంధించిన ఈమెయిల్‌ ఐడి పాస్వర్డ్‌ అందజేసినందున పోటీలో ఉన్న అభ్యర్థుల ...

Read More »

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

రెంజల్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌, నీలా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందితో పోలింగ్‌ సరళిని ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయ అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఎండ ...

Read More »

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

నందిపేట్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాంపూర్‌, మిర్థపల్లి, దేగం, మచ్చర్ల, కుద్వంపూర్‌, సిద్దాపూర్‌, వన్నెల్‌ కె గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్ధులని గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు. అన్ని కుల సంఘాల మద్దతు కోసం సంఘాలు అభ్యర్థులతో తిరిగారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి పనులను వారికి వివరించారు. ...

Read More »

రెండో విడత పోలింగ్‌ ప్రశాంతం

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ డివిజన్లో శుక్రవారం జరిగిన రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం ఆయన బోధన్‌ డివిజన్‌ పలు పోలింగ్‌ కేంద్రాలలో పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఎడపల్లి మండలం జానకంపేట్‌, రెంజల్‌ మండలం సాటాపూర్‌, నీలా, బోధన్‌ మండలం సాలూర, కోటగిరి మండల కేంద్రం, వర్ని, ఎడపల్లి మండల కేంద్రాల్లో ఆయన పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం పోచారం స్వగ్రామంలో దేశాయ్‌పేట సొసైటీ అధ్యక్షుడు, బాన్సువాడ నియోజకవర్గ తెరాస సమన్వయకర్త పోచారం భాస్కర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పిటిసి, ఎంపిటిసిలకు సంబంధించిన ఓటు హక్కును ఆయన శుక్రవారం వినియోగించుకున్నారు.

Read More »