Breaking News

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపులో ఏలాంటి తప్పులకు తావివ్వకుండా రిటర్నింగ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత ఎన్నికల సంఘం ఐటీ డైరెక్టర్‌ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు జిల్లా ఎన్నికల అధికారులతో సువిధలో కౌంటింగ్‌ నమోదు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ వివరాలు సువిధ అప్లికేషన్‌లో నమోదు చేయాలని, అందుకు సంబంధించిన ఈమెయిల్‌ ఐడి పాస్వర్డ్‌ అందజేసినందున పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు పోలింగ్‌ టర్న్‌ అవుట్‌ ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్‌ ఏఆర్‌ఓలు కౌంటింగ్‌ రౌండ్‌ షెడ్యూల్డ్‌ వివరాలు అందులో పొందుపరచాలని అన్నారు.

ఈనెల 21న టెస్టింగ్‌ చేయాలన్నారు. ఆర్‌ఓ రిజల్ట్‌ ప్రకటించిన తర్వాత ఏలాంటి డేటా మార్పు చేయడానికి వీలుండదని ప్రకటించే ముందే మొత్తం పరిశీలన చేసుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించాలని చెప్పారు. కౌంటింగ్‌ వివరాలు ఎప్పటికప్పుడు సువిధ ఆప్‌లో సమాచారాన్ని తెలుసుకోవచ్చునని చెప్పారు. అవసరమైన వారు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ఆప్‌ ఏ ఏఅర్‌ఓలు కౌంటింగ్‌ నమోదులో వెనుకబడి ఉన్నారో అర్‌ఓ పరిశీలన చేసుకోవచ్చునని చెప్పారు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చునని, ప్రధాన కూడళ్లలో డిస్‌ప్లే బోర్డు పెట్టవచ్చునని చెప్పారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, డిఆర్‌ఓ అంజయ్య, నగరపాలక కమిషనర్‌ జాన్‌ శాంసన్‌, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి ఉదయ్‌ కుమార్‌, ఎన్‌ఐసి రాజగోపాల్‌, ఈడి ఎం కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *