Breaking News

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

నందిపేట్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాంపూర్‌, మిర్థపల్లి, దేగం, మచ్చర్ల, కుద్వంపూర్‌, సిద్దాపూర్‌, వన్నెల్‌ కె గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్ధులని గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు. అన్ని కుల సంఘాల మద్దతు కోసం సంఘాలు అభ్యర్థులతో తిరిగారు.

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి పనులను వారికి వివరించారు. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, రైతు బంధు వంటి పథకాలు గ్రామములో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసమే అని వారికి వివరించారు. గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని వారికి మాట ఇచ్చారు. ఆయన వెంట తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *