Breaking News

రెండో విడత పోలింగ్‌ ప్రశాంతం

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ డివిజన్లో శుక్రవారం జరిగిన రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం ఆయన బోధన్‌ డివిజన్‌ పలు పోలింగ్‌ కేంద్రాలలో పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఎడపల్లి మండలం జానకంపేట్‌, రెంజల్‌ మండలం సాటాపూర్‌, నీలా, బోధన్‌ మండలం సాలూర, కోటగిరి మండల కేంద్రం, వర్ని, ఎడపల్లి మండల కేంద్రాల్లో ఆయన పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా అవసరమైన చోట రిటర్నింగ్‌ అధికారులకు, ఎంపీడీఓలకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది, అధికారులు గుర్తింపు కార్డులు పెట్టుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని 8 జడ్‌పిటిసిలు, 75 ఎంపీటీసీలకు కలిపి మొత్తం 412 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు మూడు వేల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, రెండు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, సిబ్బందికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశామని, అదేవిధంగా ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాలలో కనీస సదుపాయాలైన టెంట్లు, చల్లని తాగునీరు, దివ్యాంగులైన ఓటర్లకు వీల్‌ చైర్స్‌, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

గతంలో జరిగిన ఎన్నికలను పురస్కరించుకుని నాటి సంఘటన దష్టిలో పెట్టుకొని ఎటువంటి సంఘటనలకు అవకాశం లేకుండా అవసరమైన చోట బందోబస్తు తోపాటు లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌, కొన్ని చోట్ల వీడియో రికార్డింగ్‌, మైక్రో ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల వారికి ఆయన కతజ్ఞతలు తెలిపారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *