Breaking News

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

రెంజల్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌, నీలా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందితో పోలింగ్‌ సరళిని ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయ అని అడిగి తెలుసుకున్నారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఎండ వేడిమి దష్టిలో ఉంచుకొని షామియానాలు, తాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వైద్య అధికారులు ఏర్పాటు చేసిన ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌కి వెళ్లి ఏఎన్‌ఎంలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎండలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు వైద్య సిబ్బంది ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలింగ్‌ శాతాన్ని పెంచాలని శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు కషి చేయాలని సూచించారు. ఆయన వెంట తహసిల్దార్‌ అసదుల్లా ఖాన్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *