Breaking News

తెలంగాణ ఆత్మగౌరవ కవి డాక్టర్‌ సామల సదాశివ

నిజామాబాద్‌, మే 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామల సదాశివ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కవి అని, ఆయన చూపిన మార్గం తెలంగాణ భాషకు గొప్ప స్థితిని తీసుకు వచ్చిందని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్‌ అన్నారు. ఆయన శనివారం కేర్‌ డిగ్రీ కళాశాలలో డాక్టర్‌ సామల సదాశివ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. డాక్టర్‌ సామల సదాశివ అనువాద సాహిత్యంలో చేసిన కషి ఎంతో గొప్పదని, రూబాయిల ప్రక్రియను తెలంగాణ సాహిత్యంలో గొప్ప స్థాయిలో నిలబెట్టారని ఆయన అభివర్ణించారు. నిజామాబాద్‌ జిల్లా హరిదా రచయితల సంఘం డాక్టర్‌ సామల సదాశివ తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని అందించడం తమ అదష్టంగా భావించిందన్నారు. సదాశివ సాహిత్యంపై, ఆయన చేసిన కషిపై అధ్యయనం చేయాల్సిన బాధ్యత తెలంగాణ విశ్వవిద్యాలయాలపై ఉన్నదని ఆయన వివరించారు.

తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ మాట్లాడుతూ సామల సదాశివ జీవితం తెలంగాణ సామాన్య జీవితానికి అద్దం పడుతుందని, ఆయన రచనలు ముచ్చట పెట్టినట్టుగా ఉంటాయని తెలంగాణ ముచ్చట్లకు సాహిత్యంలో స్థానం కల్పించిన వ్యక్తి డాక్టర్‌ సదాశివ అని వివరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్‌ త్రివేణి మాట్లాడుతూ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎంతోమందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడని, అలాగే అనేక మంది కవులకు మార్గదర్శకం వహించిన ప్రజాకవి అని ఆమె సదాశివ సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.నరసింహ స్వామి, బట్టు శ్రీధర్‌రాజు, కొయ్యడ శంకర్‌, మద్దుకూరి సాయిబాబు, ఎమ్‌.ఏ.రషీద్‌, తంగళ్ళపల్లి నరేశ్‌చారి, ప్రసాద్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పూడికతీత పనుల‌ పరిశీల‌న

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 1 నుండి 8 వ తేదీ వరకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *