Breaking News

Daily Archives: May 12, 2019

సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి

నిజాంసాగర్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌తోనే అభివద్ధి జరుగుతుందని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే అన్నారు. ఆదివారం నిజాంసాగర్‌ మండలం లోని మల్లూరు, నిజాంసాగర్‌ గ్రామాల్లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరిగిందన్నారు. 70 సంవత్సరాలలో జరగని అభివద్ధి ఐదేళ్లలో చేసి ...

Read More »

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు వసతులు కల్పించాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ డివిజన్‌లో జరుగు మూడో విడత జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు సందర్భంగా ఆదివారం సాయంత్రం వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో చల్లటి త్రాగునీరు, టెంటు, ఓఅర్‌యస్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, దివ్యాంగులకు ...

Read More »

రాశివనంలో మొక్కలు నాటిన ఎన్నికల పరిశీలకురాలు

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలోని రాశివనంలో ఆదివారం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు అభిలాష్‌ బిస్తు మొక్కలు నాటారు. హరితవనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర అవసరమని, ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని కోరారు. రాశివనాన్ని అద్బుతంగా తీర్చిదిద్దారని, అన్నిరకాల మొక్కలు నాటుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందిస్తున్నారని ప్రశంసించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, నిజామాబాద్‌ కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, జిల్లా ఎస్‌పి శ్వేత తదితరులున్నారు.

Read More »

స్ట్రాంగ్‌రూంల పరిశీలన

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడోవిడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌రూంలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ, బ్యాలెటు బాక్సుల భద్రత, కౌంటింగ్‌కు సంబందించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, పూర్తిస్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఎంపిడివో చిన్నారెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

పోలింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌రోజు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న పొరపాటుకు ఆస్కారమివ్వద్దని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ రోజు చెక్‌ లిస్టు ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి శ్వేత, ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఎంపిడివో చిన్నారెడ్డి, ఎన్నికల ...

Read More »

మూడోవిడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో ఈనెల 14న నిర్వహించనున్న జడ్పిటిసి, ఎంపిటిసి మూడోవిడత ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి శ్వేతతో కలిసి మాట్లాడారు. 14న ఎల్లారెడ్డి డివిజన్‌లోని గాంధారి, లింగంపేట్‌, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డితోపాటు బాన్సువాడ డివిజన్‌లోని నిజాంసాగర్‌, పిట్లం మొత్తం 6 మండలాలకు జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఓటర్లు ఓటరు స్లిప్పుతోపాటు ...

Read More »

ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమీషన్‌ క్లారిటి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమీషన్‌ క్లారిటీ ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీచేయడంతో పాటు ఎం-3 రకం ఈవీఎంల వినియోగంతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం అందరి దష్టిని ఆకర్షించింది. రెండు చోట్ల నిజామాబాద్‌ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేసింది. 5 నియోజకవర్గాల లెక్కింపు డిచ్‌పల్లి సీఎంసి కళాశాలలో, జగిత్యాల, కొరుట్ల లెక్కింపు కొరకు జగిత్యాలలో ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. దేశంలో అన్నీ ఫలితాలు ఈనెల 23న రాత్రి ...

Read More »

మేకప్‌ బాక్స్‌

నన్ను అందంగా తీర్చిదిద్దుకుని కనులారా చూసుకుని మురిసిపోతూ నాకిఛ్చిన మేకప్‌ బాక్స్‌ అమ్మ నుదుటన సింధురంలా ఎరుపురంగులో మెరిసిపోతోంది కనులకు కాటుక తీర్చి సోగకన్నుల అందాలను తనివితీరా చూసుకునేది నుదుటన తిలకం దిద్ది చంద్రబింబానను గుండెలకు హత్తుకునేది పౌడరు అద్ది పాలచెక్కిళ్ళను చుంబించే అమ్మ స్పర్శ తనువంతా నిండిపోయేది అమ్మ చీరను చుట్టి నా తల్లి అంటూ నన్ను అమ్మని చేసి నా ఒళ్ళో తల వాల్చి అమ్మదనంలోని కమ్మదనం పొందేది అమ్మ గోరుముద్ద కోసం అమ్మ తీయని పిలుపు కోసం అమ్మ చల్లని ...

Read More »

మూడవ విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌ / కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌లో జరుగు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సంబంధించి ఎన్నికల సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్‌ జిల్లా సాధారణ పరిశీలకురాలు అభిలాష్‌ భిస్తు సమక్షంలో పూర్తి చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కామారెడ్డి నిజామాబాద్‌ జిల్లాలో మూడో విడతలో ఆర్మూర్‌, ఎల్లారెడ్డి డివిజన్‌లో జరుగు ఎన్నికల కోసం సిబ్బందినీ ఆయా పోలింగ్‌ స్టేషన్లకు కేటాయింపు ర్యాండమైజేశన్‌ పక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ...

Read More »

సిఎంసిని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన డిచ్‌పల్లిలోని సీఎంసీని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పర్యటించి పరిశీలించారు. ఆదివారం ఆయన క్రిస్టియన్‌ కళాశాలలో పర్యటించి పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఈవిఎంలను భద్రపరిచిన రూములను వాటికి వేసిన సీల్‌లను పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బందిని, అందుబాటులో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిటర్స్‌ రిజిస్టర్లో పర్యటించిన వారి వివరాలను పరిశీలించారు. రిజిస్టర్లో తాను పర్యటించిన వివరాలను నమోదు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే ...

Read More »