Breaking News

మేకప్‌ బాక్స్‌

నన్ను అందంగా తీర్చిదిద్దుకుని

కనులారా చూసుకుని మురిసిపోతూ

నాకిఛ్చిన మేకప్‌ బాక్స్‌

అమ్మ నుదుటన సింధురంలా

ఎరుపురంగులో మెరిసిపోతోంది

కనులకు కాటుక తీర్చి

సోగకన్నుల అందాలను

తనివితీరా చూసుకునేది

నుదుటన తిలకం దిద్ది

చంద్రబింబానను గుండెలకు హత్తుకునేది

పౌడరు అద్ది పాలచెక్కిళ్ళను

చుంబించే అమ్మ స్పర్శ

తనువంతా నిండిపోయేది

అమ్మ చీరను చుట్టి నా తల్లి అంటూ

నన్ను అమ్మని చేసి నా ఒళ్ళో తల వాల్చి

అమ్మదనంలోని కమ్మదనం పొందేది

అమ్మ గోరుముద్ద కోసం

అమ్మ తీయని పిలుపు కోసం

అమ్మ చల్లని ప్రేమ కోసం

అమ్మ వెచ్చని ఒడి కోసం

ఎన్ని జన్మలైనా ఎత్తాలనిపిస్తుంది

భార్యనయ్యాను

అమ్మనయ్యాను

అమ్మమ్మనీ అయ్యాను

అయినా అమ్మ ప్రేమ తడి ఆరలేదు

అమ్మ ఇచ్చిన మేకప్‌ బాక్స్‌ మా ఇంట్లో పదిలం

అమ్మ జ్ఞాపకాల పేటిక నా గుండెలో పదిలం

అన్యం పద్మజారెడ్డి

సెల్‌ : 9441507852

నిజామాబాద్‌

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *