Breaking News

ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమీషన్‌ క్లారిటి

నిజామాబాద్‌, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమీషన్‌ క్లారిటీ ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీచేయడంతో పాటు ఎం-3 రకం ఈవీఎంల వినియోగంతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం అందరి దష్టిని ఆకర్షించింది. రెండు చోట్ల నిజామాబాద్‌ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేసింది. 5 నియోజకవర్గాల లెక్కింపు డిచ్‌పల్లి సీఎంసి కళాశాలలో, జగిత్యాల, కొరుట్ల లెక్కింపు కొరకు జగిత్యాలలో ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.

దేశంలో అన్నీ ఫలితాలు ఈనెల 23న రాత్రి వరకు వస్తే నిజామాబాద్‌ ఫలితం మరుసటి రోజు పూర్తీ కావచ్చే అవకాశాలు కనిపిస్తాయి. నిజామాబాద్‌ లో 18 టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపు, అత్యధిక ఓటర్లు గల మల్కాజిగిరి నియోజకవర్గంలో 24 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్‌ వివరాలు సువిధ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి, ఇతరత్రా విషయాలపై ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తీచేసినట్టు తెలిపారు.

Check Also

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *