Breaking News

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు వసతులు కల్పించాలి

కామారెడ్డి, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ డివిజన్‌లో జరుగు మూడో విడత జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు సందర్భంగా ఆదివారం సాయంత్రం వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో చల్లటి త్రాగునీరు, టెంటు, ఓఅర్‌యస్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, దివ్యాంగులకు వీల్‌ చైర్‌ ఏర్పాటు చేసి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది మూడవ దశ కేటాయింపు పూర్తి అయినందున వెంటనే నియామక పత్రాలను వ్యక్తిగతంగా అందజేయాలని చెప్పారు.

అందరూ సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యే విధంగా సంబంధిత ఎంఈవోలు, డిఈఓలు తగు చర్యలు తీసుకోవాలని అవసరమైతే వీరిని సంప్రదించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఎన్నికల సామాగ్రి పోలింగ్‌ సిబ్బంది సురక్షితంగా చేరిన విషయాన్ని నివేదిక రూపంలో అందజేయాలని కలెక్టర్‌ కోరారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో కనీస వసతులు కల్పించాలని పోలింగ్‌ సిబ్బందికి భోజన వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పార్టుబిలో అర్హులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని కోర్టు కేసులు ఉన్నవి మినహా అర్హులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని ఈ విషయంలో నిర్లక్ష్యం జాప్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్‌ తహశీల్దార్‌లను ఆదేశించారు.

మోర్తాడ్‌లో గ్రామ కార్యదర్శులతో మాట్లాడుతూ గ్రామాల్లో సానిటేషన్‌ మరింత మెరుగు పరచాలని త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరుకు గ్రామ నర్సరీలో మొక్కలు పెంచే బాధ్యత గ్రామ కార్యదర్శులదని, నాటిన మొక్కలను సంరక్షణ బాధ్యత కూడా కార్యదర్శులదే అన్నారు. జిల్లా కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ అర్‌డీఓ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *