Breaking News

మూడవ విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌ / కామారెడ్డి, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌లో జరుగు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సంబంధించి ఎన్నికల సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్‌ జిల్లా సాధారణ పరిశీలకురాలు అభిలాష్‌ భిస్తు సమక్షంలో పూర్తి చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కామారెడ్డి నిజామాబాద్‌ జిల్లాలో మూడో విడతలో ఆర్మూర్‌, ఎల్లారెడ్డి డివిజన్‌లో జరుగు ఎన్నికల కోసం సిబ్బందినీ ఆయా పోలింగ్‌ స్టేషన్లకు కేటాయింపు ర్యాండమైజేశన్‌ పక్రియ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ఆర్మూర్‌ డివిజన్‌లో 11 జడ్పీటీసీలు, 124 ఎంపీటీసీ జరుగు ఎన్నికల కోసం 639 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనంగా 20 శాతం సిబ్బంది కేటాయించగా మొత్తం 4464 మంది సిబ్బంది, కాగా అందులో 767 పిఓలు, ఏపీఓలు 767, ఇతర పోలింగ్‌ సిబ్బంది 2930 మందిని నియమించినట్లు చెప్పారు. 400 ఓటర్లు గల 114 పోలింగ్‌ స్టేషన్లు, 400 పైబడి ఓటర్లు గల 525 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్‌ ఈ సందర్భంగా వివరించారు.

Check Also

తెలంగాణ ప్రజల‌కు కొత్తగా ఒరిగిందేమీ లేదు

కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *