Breaking News

నేడు తుదివిడత పోలింగ్‌

నిజామాబాద్‌, మే 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌లో తుదివిడత జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా తప్పని సరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లాలో తుదివిడత జెడ్‌పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు ఆర్మూర్‌ డివిజన్‌లోని 11 మండలాల్లో ఈ నెల 14 వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగతుందనీ చెప్పారు. 11 జడ్పీటిసిలు, 124 ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. తుది విడతలో 3 లక్షల 17 వేల 559 మంది ఓటర్లు, కాగా అందులో ఒక లక్ష 72 వేల 12 మంది మహిళా ఓటర్లు, ఒక లక్ష 45 వేల 542 మంది పురుష ఓటర్లు, ఇతరులు ఐదుగురు ఉన్నారన్నారు. ఓటర్‌ల కోసం 639 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, పోలింగ్‌ సమర్థ నిర్వహణ కోసం మొత్తం 4465 మంది పోలింగ్‌ సిబ్బందిని, 20 శాతం అదనంగా కలుపుకొని విధులు నిర్వహిస్తారని అందులో 767 పివోలు, ఏపీఓలు 767 ఇతర పోలింగ్‌ సిబ్బంది 2931 మందిని నియమించినట్లు కలెక్టర్‌ వివరించారు.

ఎండలు తీవ్రంగా ఉన్నందున ఓటు వేసే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలుగకుండా చల్లటి త్రాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ప్రథమ చికిత్స కేంద్రం, ఎలక్ట్రిసిటీ నిరంతర సరఫరా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అదేవిధంగా దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీల్‌ చైర్స్‌, ర్యమ్స్‌ కూడా ఏర్పాట్లు చేసినందున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. గత ఎన్నికలలో జరిగిన సంఘటనలు పోటీలో ఉన్న అభ్యర్థుల బట్టి డివిజన్‌లో 192 లొకేషన్లలో 229 సున్నిత, అతిసున్నిత పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినందున అక్కడ ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని, 46 సూక్ష్మ పరిశీలకులను, 70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ 159 పోలింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రాఫీ ఏర్పాటు చేశామన్నారు.

డివిజన్‌లో జడ్పీటిసిలకు ఒక్కటి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదని, 7 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవంగా అయినట్లు అందులో బాల్కొండ మండలంలోని జలాల్‌ పూర్‌, మెండోరా మండలంలోని పోచంపాడు, సొన్‌పెట్‌, భింగల్‌ మండలంలో బడాబింగల్‌ 1, గొన్‌గొప్పుల, వేల్పూర్‌ మండలంలో మోతే, పచ్చల్‌నడ్కుడ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ వివరించారు. జడ్పీటిసి బ్యాలెట్‌ వైట్‌ కలర్‌, ఎంపిటిసి బ్యాలెట్‌ పేపర్‌ పింక్‌ కలర్‌లో ఉంటాయని కలెక్టర్‌ చెప్పారు. తుదివిడతలో 117 ఎంపిటిసి స్థానాలకు 372 మంది, 11 జడ్పీటిసిలకు 40 మంది పోటీలో ఉన్నారని కలక్టర్‌ వివరించారు. 400 ఓటర్లుగల పోలింగ్‌ కేంద్రాలు 114, 400 ఓటర్లు పైగల పోలింగ్‌ కేంద్రాలు 525 ఉన్నాయన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *