Breaking News

పలు శాఖలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్పరెన్సు

నిజామాబాద్‌, మే 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) కింద మంజూరు చేసిన వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం, పెండింగ్‌ వాటిని వెంటనే పూర్తి చేసి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేలా జిల్లా కలెక్టర్‌లు దష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె జోషి అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ సచివాలయం నుండి పంచాయతి రాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్‌ లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల హేతుబద్ధీకరణ, అంగన్‌వాడీ భవనాలు నిర్మాణం, చెరువుల హద్దులు ఏర్పాటు, రంజాన్‌ సందర్బంగా గిఫ్ట్‌ ప్యాకెట్‌ల పంపిణీ, బడిబాట అంశాలపై జిల్లా కలెక్టర్‌లకు మార్గదర్శకాలు, సూచనలు చేశారు.

నిధులను సద్వినియోగం చేసుకొని నూరు శాతం రిజిస్ట్రేషన్‌ మంజూరు చేసి సాధ్యమైనంత త్వరగా జిల్లా కలెక్టర్‌లు నిర్దేశిత సమయంలో మరుగు దొడ్లను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాల్లో మంజూరు చేసిన అంగన్‌వాడీ భవనాలు నిర్మాణానికి స్థలాలను గుర్తింపు చేయాలని, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు శిశువులు, గర్భిణీలు, బాలింతల సంఖ్య ననుసరించి హేతుబద్దీకరణ చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు వున్న పరిసర ప్రాంతంలోకి వుండేలా చూడాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో టాయిలెట్‌ సౌకర్యం వుండాలని, లేకుంటే నిర్మించాలన్నారు.

అద్దె భవనాలు ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్డి ఉండేవిధంగా చూడాలని, ఒకవేళ లేనిపక్షంలో మరుగుదొడ్లు ఉన్న భవనాలకు మార్పు చేయాలని, అంగన్‌వాడీల హేతుబద్ధీకరణలో కలెక్టర్లు స్వయంగా చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాకెట్‌లు జిల్లాలకు మే 15 నుండి 20 వరకు పంపిణీ చేయనున్నట్లు, జిల్లాల్లో స్టోరేజ్‌ పాయింట్‌లు గుర్తించాలని, ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకున్నందున వాటి పంపిణీకి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇఫ్తార్‌ విందు తేదీలు ఎన్నికల కమిషన్‌ అనుమతితో తెలియ చేస్తామని అన్నారు. జూన్‌ ఒకటి నుండి బడి బయట ఉన్న పిల్లలను, డ్రాప్‌ అవుట్స్‌ను పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరిగోడ లేనిపక్షంలో నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, అన్ని ప్రాథమిక పాఠశాల ఆవరణలో అంగన్‌ వాడి కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా ఎఫ్‌.టి.ఎల్‌., హద్దులు రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ శాఖలు గుర్తించాలని అన్నారు. హద్దులు గుర్తించిన తర్వాత ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి ఫిర్యాదును స్వీకరించి ఫైనల్‌ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. చెత్త తరలింపునకు డంపింగ్‌ యార్డ్‌ల కోసం స్థలసేకరణ చేయాలని గ్రామ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ వారిగా స్థల సేకరణ పూర్తి చేయాలని నివాసిత ప్రాంతాలకు దగ్గర కాకుండా దూరంగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కమర్షియల్‌ టాక్స్‌ కార్యాలయాల భవన నిర్మాణానికి ఎక్సైజ్‌ ఐఎంఎల్‌ డిపోల నిర్మాణానికి పాల సేకరణ చేయాలనీ కలెక్టర్‌ కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, డిఆర్‌డిఓ రాథోడ్‌ రమేష్‌, ఐసీడీఎస్‌ పీడీ స్రవంతి, డిఈఓ దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *