Breaking News

Daily Archives: May 14, 2019

తెరాస అభ్యర్థులు గెలవడం ఖాయం

నిజాంసాగర్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్‌ సిఎంగా తెరాస ప్రభుత్వంలోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందన్నారు. ఆయన వెంట నాయకులు బోయిని సాయిలు, క్యాస గుండయ్య, మహమ్మద్‌ గౌస్‌, తదితరులు ఉన్నారు.

Read More »

పోలింగ్‌ కేంద్రం తనిఖీ

నిజాంసాగర్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హాసన్‌పల్లిలో జరుగుతున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని డీఎస్పీ యాదగిరి మంగళవారం తనిఖీ చేశారు. నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌, కారోబార్‌ లింగాల రాములు, విఆర్వో ...

Read More »

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల పరిశీలన

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన తుదివిడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియను నిశితంగా గమనించారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సరళిని గమనిస్తు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేశారు. వెబ్‌కాస్టింగ్‌లో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఎన్నికల లైజనింగ్‌ అధికారి శాయన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన సాధారణ పరిశీలకురాలు

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు అభిలాష బిస్తు మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని మాడల్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్‌రూంలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లు, బందోబస్తుపై ఆమె సమీక్షీంచారు. కౌంటింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, అన్ని సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్‌పి అనన్య, డిఎస్‌పిలు లక్ష్మినారాయణ, సత్యన్న, ఎంపిడివోలు చిన్నారెడ్డి, ఎన్నికల అధికారులు, ...

Read More »

పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన తుదివిడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సందర్శించారు. గాంధారి మండలం జువ్వాడి, మహాదేవుపల్లి, గాంధారి, లింగంపేట మండలం నల్లమడుగు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించి, పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ సరలి, పోలింగ్‌ నిర్వహించిన తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఎంపిడివోలు నాగేశ్వర్‌, శ్రీకాంత్‌, సిబ్బంది ...

Read More »

తుదివిడతలో 75.31 శాతం పోలింగ్‌ నమోదు

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి తుదివిడత ఎన్నికలు మంగళవారం కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో 75.31 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగిరెడ్డిపేటలో 78.94 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా గాంధారిలో 72.90 శాతం పోలింగ్‌ నమోదైంది. లింగంపేట్‌-73.13, ఎల్లారెడ్డి-75.16, నిజాంసాగర్‌ – 78.05, పిట్లం- 75.48 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.

Read More »

అన్ని తామై అంత్యక్రియలు చేసిన ఆత్మబంధువులు

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కన్నవారే కాదు పొమ్మంటున్న లోకంలో మేమున్నామంటూ అన్ని తామై అంత్యక్రియలు చేసి పోలీసులు, సామాజిక బాద్యులు మానవత్వాన్ని చాటారు. బీహార్‌ వాస్తవ్యుడైన రాజా సన్హి, సంపత్‌ సన్హి బైక్‌పై హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళుతూ కామారెడ్డి టేక్రియాల్‌ వద్ద డివైడర్‌ను ఢీకొని మృతి చెందారు. మృతుల కుటుంబీకులు, బంధువులు ఇక్కడినుంచి 2 వేల కిలోమీటర్లు బీహార్‌ తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో వారికి కామారెడ్డి శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు ...

Read More »

విద్యాసంస్థల ప్రారంభం నాటికి వాహనాలు ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ నుండి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభమయ్యే వరకు వాహనదారులు సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో తమ తమ బస్సులు, వ్యానులు, ఇతరత్రా వాహనాలు ఫిట్‌నెస్‌ చేసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి డి.వి రెడ్డి తెలిపారు. సంబంధిత వాహనదారులు ఫిట్‌నెస్‌ లేకుండా వాహనాలను నడిపిన పక్షంలో జప్తు చేసి చట్టరీత్యా తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు, సంబంధిత వాహనదారులు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలని ఆయన కోరారు.

Read More »

70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలన

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్లో జరుగు తుదివిడత ఎంపీటీసీ, జెడ్‌పిటిసి ఎన్నికలలో ఎన్నిక సరళిని పరిశీలించేందుకు ప్రగతిభవన్లో ఏర్పాటుచేసిన వెబ్‌ కాస్టింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా 70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రం వారీగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 46 లోకేషన్లలో 229 సున్నిత అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినందున కేంద్రాలలో ఏలాంటి అవాంఛనీయ ...

Read More »

చెక్‌డ్యాం పనుల కొరకు సర్వే

బీర్కూర్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బీర్కూర్‌ మంజీర పరివాహక ప్రాంతంలో గల చెక్‌ డ్యామ్‌ పనుల కొరకు ఏ.ఇ. భూమన్న సర్వే చేపట్టారు. అలాగే 15 రోజులలో పనులు ప్రారంభం చేస్తామన్నారు. ఆయన వెంట బీర్కూర్‌ తెరాస మండల అధ్యక్షులు రఘు, బుడ్డరాజు, లాడిగం గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

ప్రశాంతంగా పరిషత్‌ తుదివిడత పోలింగ్‌ పూర్తి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌లో తుదివిడత ప్రాదేశిక ఎన్నికలలో ఏలాంటి చెదురుముదురు సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌, ఆలూరు గ్రామాలలో, నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన వసతులను పరిశీలించారు. ఓటర్లకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ ...

Read More »