Breaking News

ప్రశాంతంగా పరిషత్‌ తుదివిడత పోలింగ్‌ పూర్తి

నిజామాబాద్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌లో తుదివిడత ప్రాదేశిక ఎన్నికలలో ఏలాంటి చెదురుముదురు సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌, ఆలూరు గ్రామాలలో, నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన వసతులను పరిశీలించారు. ఓటర్లకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ డివిజన్లో 11 మండలాల్లో జడ్పీటీసీలకు, 124 ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అందులో ఎంపీటీసీలు 7 ఏకగ్రీవంగా ఎన్నికవగా, మిగతా 117 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

11 జడ్పిటిసి స్థానాలకు 40 మంది అభ్యర్థులు, 117 ఎంపిటిసి స్థానాలకు 372 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, అందుకోసం 639 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా, అందులో సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు సూక్ష్మ పరిశీలకులు వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎన్నికల నిర్వాహకులకు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో చల్లటి త్రాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, దివ్యాంగులకు వద్ధులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టి వారి కోసం వీల్‌చైర్‌ రవాణా సౌకర్యాలను కల్పించడం జరిగిందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

జిల్లాలో మూడు విడతలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్‌ కతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు ఓటర్లు జిల్లా అధికారులు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్‌ గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏవిధంగానైతే సహకరించారో జెడ్‌పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా ప్రజల సహకారం మరువలేనిదని జిల్లా కలెక్టర్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం మోర్తాడ్‌ మండల కేంద్రం జడ్పీ హైస్కూల్‌లో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలన చేశారు. ఓటింగ్‌ సమయం పూర్తికాగానే ఓటరుగా ఎవరులేని పక్షంలో బ్యాలెట్‌ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీల్‌చేసే చర్యల్లో భాగంగా పోలింగ్‌ ఏజెంట్లతో తప్పనిసరిగా సంతకాలు తీసుకోవాలని పోలింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

మోర్తాడ్‌ మండలంలోని అంక్సాపూర్‌ 6 పోలింగ్‌ కేంద్రాల్లో సీల్‌ చేసే పక్రీయాను పరిశీలించి జరిగిన ఓటింగ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌ ఎంపిటిసి, జడ్పీటిసి ఓట్ల లెక్కింపు మైనారిటీ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఏర్పాట్లు చేసినందున స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ గదులలో ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్డీవోను ఆదేశించారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *