Breaking News
దహనసంస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యం

అన్ని తామై అంత్యక్రియలు చేసిన ఆత్మబంధువులు

కామారెడ్డి, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కన్నవారే కాదు పొమ్మంటున్న లోకంలో మేమున్నామంటూ అన్ని తామై అంత్యక్రియలు చేసి పోలీసులు, సామాజిక బాద్యులు మానవత్వాన్ని చాటారు. బీహార్‌ వాస్తవ్యుడైన రాజా సన్హి, సంపత్‌ సన్హి బైక్‌పై హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళుతూ కామారెడ్డి టేక్రియాల్‌ వద్ద డివైడర్‌ను ఢీకొని మృతి చెందారు. మృతుల కుటుంబీకులు, బంధువులు ఇక్కడినుంచి 2 వేల కిలోమీటర్లు బీహార్‌ తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో వారికి కామారెడ్డి శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.

దేవునిపల్లి పోలీసులు హెడ్‌కానిస్టేబుల్‌ శంకర్‌, రవికుమార్‌, రైటర్‌ విశ్వనాథ్‌, సామాజిక బాధ్యులు రాకేశ్‌ శర్మ, చక్రధర్‌రావు, నర్సింలు, దినేశ్‌ పాటిల్‌ తదితరులు దహనసంస్కారాలు జరిపి మానవత్వాన్ని చాటారు. ఈ సంఘటనతో పలువురి ప్రశంసలు పొందారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *