Breaking News

స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన సాధారణ పరిశీలకురాలు

కామారెడ్డి, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు అభిలాష బిస్తు మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని మాడల్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్‌రూంలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లు, బందోబస్తుపై ఆమె సమీక్షీంచారు. కౌంటింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, అన్ని సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్‌పి అనన్య, డిఎస్‌పిలు లక్ష్మినారాయణ, సత్యన్న, ఎంపిడివోలు చిన్నారెడ్డి, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Check Also

రైతుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నియంత్రిత వ్యవసాయం గురించి తమకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *