Breaking News

70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలన

నిజామాబాద్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్లో జరుగు తుదివిడత ఎంపీటీసీ, జెడ్‌పిటిసి ఎన్నికలలో ఎన్నిక సరళిని పరిశీలించేందుకు ప్రగతిభవన్లో ఏర్పాటుచేసిన వెబ్‌ కాస్టింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా 70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రం వారీగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 46 లోకేషన్లలో 229 సున్నిత అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినందున కేంద్రాలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుతో పాటుగా 70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ 46 పోలింగ్‌ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల నియామకం, 159 పోలింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రాఫి ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ చెప్పారు.

ఆర్మూర్‌లో 14 పోలింగ్‌ కేంద్రాలు, బాల్కొండ 12, జక్రాన్‌పల్లి 7, కమ్మర్‌పల్లి 4, మెండోరా 4, మోర్తాడ్‌ 10, నందిపెట్‌ 16, వేల్పూరు 3 పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రాదేశిక ఎన్నికల జిల్లా పరిశీలకురాలు అభిలాష్‌ భిస్ట్‌ పరిశీలించారు. జిల్లాలో వెబ్‌ కాస్టింగ్‌ వీడియోగ్రాఫి సూక్ష్మ పరిశీలకుల ఏర్పాట్ల గురించి జడ్పీ సిఇఓను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ సిఇఓ వేణు, వెబ్‌ కాస్టింగ్‌ నోడల్‌ అధికారి ఉదయ్‌ కుమార్‌, ఏసిపి శ్రీనివాస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *