Breaking News

హరితహారంపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు నాటే కార్యక్రమంపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా, జిల్లా అటవీశాఖ ద్వారా సదాశివనగర్‌ మండలంలోని ధర్మారావుపేట, ఆమర్ల బండ నర్సరీల్లో 80 వేల మొక్కలు, మల్లుపేట నర్సరీలో లక్ష మొక్కల పెంపకాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. సర్పంచ్‌లు తమ గ్రామాల్లో ఏఏ ప్రాంతాల్లో ఏఏ మొక్కలు నాటాలో కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకోవాలని చెప్పారు.

ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది సహకరించాలన్నారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని, ఎర్రచందనం, టేకు, వెదురు మొక్కల కోసం రైతుల పంపిణీకై నివేదికలు సిద్దం చేసుకోవాలన్నారు. ఆయన వెంట డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అటవీ అధికారి వసంత, ఆయా గ్రామాల సర్పంచ్‌లు భాస్కర్‌రావు, లత, బాలకృష్ణ, అసిస్టెంట్‌ ప్రాజెక్టు అధికారి శృతి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *