Breaking News

రెడ్‌క్రాస్‌లో రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిభిరం నిర్వహించారు. వేసవి కాలంలో తీవ్రగా ఉన్న రక్త కొరతను అధిగమించడానికి ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ నిర్వాహకులల్లో ఒకరైన రామకష్ణ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ నిజామాబాద్‌ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి వేసవిలో రక్తం కొరత తీవ్రంగా ఉంటుందని అదే విధంగ ఇప్పుడు కూడా నిజామాబాద్‌లో రక్తం కొరత తీవ్రంగా ఉందని తెలుసుకుని ఇందూర్‌ బ్లడ్‌ డోనర్‌ సభ్యులైన రామకష రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి ముఖ్యఅతిథిగా బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ హాజరై మాట్లాడారు.

నిజామాబాద్‌లో చాలా మంది యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సంతోషకరమని ఇలా ప్రతి ఒక్కరూ ముందుకోస్తే రక్తం కొరత ఉండదన్నారు. రక్తదానం చేస్తే బలహీనంగా అవుతామని చాలా మందిలో అపోహ ఉందని, అటువంటిదేమీలేదని, రక్తదానం చేసిన వాళ్లు ఇంకా హుషారుగా ఉంటారని వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావని, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని నరాల సుధాకర్‌ పేర్కొన్నారు. శిబిరంలో దాదాపు 15 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రామక ష్ణ, రాజు, దేవేందర్‌, అరవింద్‌, రిషిదీప్‌, కొయ్యాడ శంకర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *