ఎరువులు, మందుల విక్రయ దారులు రైతుకు సహకరించాలి

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు ఇబ్బంది పడకుండా పంటలు తెగుళ్ళ బారిన పడకుండా రైతుకు అధిక దిగుబడి వచ్చేలా సరైన క్రిమిసంహారక మందులు, ఎరువులు అమ్మి డీలర్లు రైతులకు దన్నుగా నిలవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బుధవారం జనహితలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబిరంగు పురుగు, సమగ్ర యాజమాన్య పద్దతులపై కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌లకు చెందిన ఇన్‌పుట్‌ డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

వ్యవసాయ శాఖాధికారులు వర్షాకాలంలో సాగుచేసే పంటలకు వచ్చే పురుగులు, తెగుళ్ళు, వాడాల్సిన క్రిమి సంహారక మందులపై అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతే మానవ సమాజానికి వెన్నెముక అని, వారికి ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంపై సరైన అవగాహన కల్పించాలన్నారు. నకిలీ విత్తనాలు, లేబుళ్ళు లేని విత్తనాలు, లూజ్‌ ప్యాకెట్లను షాపుల్లో ఉంచవద్దని, అమ్మవద్దని స్పష్టం చేశారు. రైతులకు తప్పకుండా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో రూపొందించిన 2019 యాక్షన్‌ ప్లాన్‌ జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేంద్రయ్య, అసిస్టెంట్‌ డైరెక్టర్లు మహేశ్వరి, రత్నం, రామకృష్ణ, వ్యవసాయాధికారి నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *