Breaking News

23న కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న జరుగు లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ సీఎంసిలో నిర్వహించనున్నందున కౌంటింగ్‌ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. సీఎంసిలో నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఐదు నియోజకవర్గాలైన బాల్కొండ, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌ రూములకు వేసిన సీఎల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల కౌంటింగ్‌ గదులను పరిశీలించి ఏర్పాట్లను అతితొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ గదులలో ఏర్పాటు చేసే బ్యారి కేడింగ్‌ ఆరు ఫీట్ల పొడవుతో పటిష్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్‌ టేబుల్‌తో పాటుగా వివి ప్యాడ్‌ లెక్కింపు కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ బ్యారికెడ్లను ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌ స్థలాలను ఈ సందర్భంగా పరిశీలించారు. కౌంటింగ్‌ విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి యేజెంట్లకు, సంభందిత అర్‌ఓలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, గుర్తింపు కార్డు లేని వారు కౌంటింగ్‌ కేంద్రానికి అనుమతించ కూడదని జిల్లా కలెక్టర్‌ ఎసిపిని కోరారు. జిల్లా కలెక్టర్‌ వెంట నగరపాలక కమిషనర్‌ నిజామాబాద్‌ అర్బన్‌ రిటర్నింగ్‌ అధికారి జాన్‌ సామ్సన్‌, బాల్కొండ రిటర్నింగ్‌ అధికారి జడ్పీ సీఈవో వేణు, ఆర్మూర్‌ బోధన్‌ ఆర్‌డిఓలు శ్రీనివాస్‌, గోపీనాథ్‌, ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *