Breaking News

ఘనంగా కుస్తీ పోటీలు

నిజాంసాగర్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలోని బంజపల్లి గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 200 రూపాయల నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు 300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల వరకు కొనసాగాయి.

కుస్తీ పోటీలో పాల్గొనేందుకు మల్లయోధులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు భారీగా తరలివచ్చారు. నారాయణఖేడ్‌, నిజాంపేట్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు భారీగా తరలి వచ్చారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *