Breaking News

కౌంటింగ్‌ స్టాఫ్‌కు రెండ్రోజుల శిక్షణ

నిజామాబాద్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోకసభ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన ఛాంబర్‌ లో సంభందిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నియమించిన కౌంటింగ్‌ స్టాఫ్‌కు ఈ నెల 16, 17 తేదీలలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి కౌంటింగ్‌ పూర్తి సన్నద్ధంగా ఉండే విధంగా తయారు చేయాలన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా సిసి కెమెరాలు వీడియో గ్రాఫ్‌ చేయించాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరా అంతరాయం లేకుండా నిరంతరంగా సరఫరా ఉండే విధంగా, ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. బి.యస్‌ఎన్‌ఎల్‌ డేటా కనెక్షన్‌తో పాటుగా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు.

కౌంటింగ్‌ ఏర్పాట్లు విభజించి ఒక్కొక్క పనిని ఒక్కొక్కరికి కాంట్రాక్టు అప్పజెప్పి పనులను పూర్తి చేయాలని చెప్పారు. ప్రధాన ఎంట్రెన్స్‌ ఒకటే ఏర్పాటు చేసి లోపలికి రాగానే బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గాల వారు వెనుక వైపు నుండి, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజక వర్గాల వారు ముందునుండి పోయె విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కౌంటింగ్‌ గదులలో బ్యారి కెడింగ్‌ పటిష్టంగా ఉండాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డి అర్‌ఓ అంజయ్య, నగరపాలక కమిషనర్‌ జాన్‌ శాంసన్‌, పిఆర్‌ఎస్‌ఇ ప్రేమ్‌ కుమార్‌, ఈఈ, ఎన్‌ఐసి ఏడి రాజగోపాల్‌, కలెక్టర్‌ కార్యాలయ ఏంఓ శ్రీధర్‌, ఈడి ఏం కార్తిక్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *