Breaking News

డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలి

నిజాంసాగర్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో స్థానిక పిహెచ్‌సి ఆధ్వర్యంలో గురువరం ప్రపంచ డెంగీ దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిహెచ్‌సి నుంచి పాత బస్టాండ్‌, ఎస్‌బీఐ, అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా ర్యాలీ కొనసాగింది.

అనంతరం వైద్య అధికారి రాధా కిషన్‌ మాట్లాడుతూ డెంగీ వ్యాధి రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ర్యాలీలో హెల్త్‌ సూపర్‌ వైజర్‌ సాయమ్మ, హెచ్‌ఈఓ మోతీరాం, హెల్త్‌ అసిస్టెంట్లు సాయిలు, సుభాష్‌ గౌడ్‌, ఈశ్వర్‌ దాస్‌, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *