Breaking News

రైతు ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలం లింగంపల్లి తాండాకు చెందిన రైతు పీరియా నాయక్‌ గురువారం నసురుల్లాబాద్‌ తహసీల్‌ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం సంచలనం రేపింది. రెవెన్యూ సిబ్బంది తనకు చెందిన ఎకరం రెండు గుంటల భూమిని ఇతరుల పేరుమీద బదిలీ చేయడంతో తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నం చేసినట్టు పీరియా నాయక్‌ తెలిపారు. పురుగుల మందు తాగగానే గమనించిన స్థానికులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పీరియా అక్కడ చికిత్స పొందుతున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనవద్ద అన్ని ఆధారాలు, భూమికి సంబంధించిన దస్తావేజులు ఉన్నా కావాలనే సిబ్బంది మరొకరి పేరుమీద తన భూమిని బదిలీ చేశారని రోదిస్తు చెప్పాడు. తనకు న్యాయం జరగనందున ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. న్యాయం చేయకపోతే తనకు చావుతప్ప గత్యంతరం లేదని అన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *