Breaking News

అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకేంద్రంలో అనుమతి లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కమీషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ప్రజాప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడం నిరసిస్తూ గురువారం ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ గత మార్చి 1 వ తేదీన వాసవి స్కూల్‌ కూడలిలో స్టేట్‌బ్యాంక్‌ స్థలం వదలకుండా, అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణం పైన విచారణ చేసి ప్రజా ప్రయోజనాలు కాపాడాలని ఫిర్యాదు చెసినా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఇంటినిర్మాణ యజమానితో లాలూచిపడి నిర్మాణం కొనసాగింపుకు సహకరించారని ఆరోపించారు.

ఇలాంటి అక్రమ నిర్మాణాలు పట్టణంలో గాంధీనగర్‌ వీధిలో అక్రమంగా రోడ్డు పైన నిర్మాణం, అశోక్‌ నగర్‌, విద్యానగర్‌, దేవునిపల్లి, కల్కినగర్‌ తదితర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకుండా ఉండడం లంచాలకు అలవాటు పడ్డారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. పేదోడికి ఇంటి స్ధలం అడిగితే లాఠీలతో భయపెట్టించే అధికారులు ధనవంతుల అక్రమాలపై చర్యతీసుకొని జిల్లా కలెక్టరు అలాంటి వాటిని కూల్చివేయించాలని లేదంటే ఎంసిపిఐయు పార్టీ కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజు, రాజశేఖర్‌, నారాయణ, లీల, రజియా, బుచ్చవ్వ, రాజమణి, స్వరూప తదితరులు ఉన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *