Breaking News

రెవెన్యూ కేసులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల ప్రక్షాళనలో పెండింగ్‌లో ఉన్న ఫౌతీ కేసులను వచ్చే సోమవారానికల్లా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పౌతీ కేసుల పెండింగ్‌పై మండలాల వారిగా సమీక్షించారు.

వచ్చేనెల ధరణి వెబ్‌సైట్‌ పబ్లిక్‌ డొమైన్‌లోకి వస్తున్నందున పెండింగ్‌లో ఉన్న 4854 పౌతీ రికార్డులను వచ్చే సోమవారానికి క్లియర్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, రెవెన్యూ రికార్డుల సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *