Breaking News

ప్రేమికుల ఆత్మహత్య

సిద్దిపేట, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్‌ కథనం ప్రకారం…లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య (21), రాచకొండ తారా (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం వీరి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే విషయంలో గ్రామ పెద్దలు కనకయ్యకు 30 వేల జరిమానా విధించారు. అయినప్పటికీ కనకయ్య, తార ఒకరినొకరు ఇష్టపడుతూ వచ్చారు. కులాలు వేరు కావడంతో ఇరువురు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భవనంలోకి వెళ్లారు.

ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన కనకయ్య, తార ముందుగా వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి ఓకే తాడుతో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటి నుంచి వీరిద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులిద్దరు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. మతుడు కనకయ్య పది రోజుల క్రితమే ఆంజనేయ స్వామి మాల ధరించాడు. ఈ మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *