Breaking News

27న పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌

నిజామాబాద్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ డివిజన్‌ ఎంపీటీసీ, జెడ్‌పిటిసి ఎన్నికల కౌంటింగ్‌ కోసం నిర్మల్‌ హదయ్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ సెంటర్‌ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పరిశీలించారు. ఎంపీటీసీ, జెడ్‌పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 27న నిర్వహించనున్నందున ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ వేణు ఆదేశించారు.

నిర్మల్‌ హదయ్‌ జూనియర్‌ కళాశాలలో నిజామాబాద్‌ డివిజన్లోని నిజామాబాద్‌, మోపాల్‌ మండలాల ఓట్ల లెక్కింపు ఒకటో అంతస్తులో, సిరికొండ, నవీపేట్‌ మండలాల ఓట్ల లెక్కింపు రెండో అంతస్తులో, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి, మాక్లూర్‌ మండలాల ఓట్ల లెక్కింపు మూడో అంతస్తులో నిర్వహించనున్ననందున అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములు సీలును జిల్లా కలెక్టర్‌ ఈ సందర్భంగా పరిశీలించారు.

కౌంటింగ్‌ కేంద్రం వద్ద కంట్రోల్‌ ఏర్పాటు చేసినందున 24 గంటలపాటు పనిచేసే విధంగా సిబ్బందిని షిఫ్టు సిస్టంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సీఈఓను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జడ్పీ సీఈవో వేణు తదితరులు ఉన్నారు.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *